పురుషులు డార్క్ చాక్లెట్స్ తింటే..!

First Published | Jun 19, 2023, 2:52 PM IST

డార్క్ చాక్లెట్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిని పురుషులు తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే వీర్యకణాల సంఖ్య కూడా పెరుగుతుంది. 
 

foods for men

ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరకుంటారు. అయితే పౌష్టికాహారంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బలంగా కూడా ఉంటారు. కొన్ని ఆహారాలను పురుషులను బలంగా ఉంచడమే కాకుండా లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. ఇందుకోసం పురుషులు తప్పక తినాల్సిన ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సాల్మన్ ఫిష్

సాల్మన్ చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కు వ మొత్తంలో ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. సాల్మన్ చేపలను వారానికి రెండుసార్లు తింటే గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 


ఆకు కూరలు

ఆకు కూరల్లో పొటాషియంతో పాటుగా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

Avocado

అవొకాడో

అవొకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. 
 

nuts

గింజలు

వాల్ నట్స్, బాదం వంటి గింజల్లో అసంతృప్త కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. రోజూ గుప్పెడు గింజలను చిరుతిండిగా తింటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 
 

dark chocolate

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో ఫైబర్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు వీర్యకణాల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ ను తింటే పురుషుల్లో లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. హైబీపీ కంట్రోల్ లో ఉంటుంది. గుండె జబ్బుల రిస్క్  తగ్గుతుంది.
 

garlic

వెల్లుల్లి

వెల్లుల్లిలోని సమ్మేళనాలు పురుషుల ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. వెల్లుల్లి అంగస్తంభన సమయాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అందుకే వెల్లుల్లి పురుషుల లైంగిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటారు. వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి సప్లిమెంట్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. 
 

berries

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు, బ్లాక్ బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బెర్రీలను మీ ఆహారంలో చేర్చడం వల్ల పురుషుల గుండె ఆయుష్షు పెరుగుతుంది. 

Latest Videos

click me!