షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు ఒక వరం.. వీటిని తింటే షుగర్ లెవల్స్ అస్సలు పెరగవు

First Published | Nov 9, 2023, 4:37 PM IST

డయాబెటీస్ నయం చేయలేని వ్యాధి. అలా అని ఈ వ్యాధి గురించి పట్టించుకోకపోతే మాత్రం మీ ఆరోగ్యం రిస్క్ లో పడిపోతుంది. దీన్ని నియంత్రించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల పండ్లను తింటే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. అవేంటంటే..?
 

Image: Getty

ప్రస్తుత కాలంలో మన జీవనశైలే కాదు.. మన ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇదే ఎన్నో రోగాలకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఈ డయాబెటీస్ ను పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే దీన్ని నియంత్రించాలి. షుగర్ లెవల్స్ నార్మల్ గా ఉండాలంటే మధుమేహులు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అలాగే ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని పండ్లు మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలా అంటే ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Fruits

బొప్పాయి

బొప్పాయి బలే టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ పండును ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు. నిజానికి బొప్పాయి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును డయాబెటీస్ పేషెంట్లు కూడా ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఇది వీరి ఆరోగ్యానికి ప్రయోజకరంగా కూడా ఉంటుంది. అవును డయాబెటీస్ పేషెంట్లు ఈ పండును రెగ్యులర్ గా పరిగడుపున తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. 
 


జామకాయ

డయాబెటీస్ పేషెంట్లు కూడా జామకాయలను తినొచ్చు. నిజానికి ఈ పండ్లు డయాబెటిస్ పేషఎంట్లకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. మధుమేహులు ఈ పండ్లను స్నాక్స్ గా తీసుకోవచ్చు. 
 

Apple (सेब)

ఆపిల్ పండు

రోజుకో ఆపిల్ పండును తింటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు అన్న మాటను తరచుగా వినే ఉంటారు. అవును మరి ఈ పండు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ పండు డయాబెటిస్ రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఎన్నో ఔషద గుణాలు షుగర్ ను నియంత్రణలో ఉంచుతాయి. కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. డయాబెటీస్ పేషెంట్లు ఉదయం పరిగడుపున ఈ పండును తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. 

పియర్

పియర్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండు. ఈ పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పెరిగిన షుగర్ లెవెల్స్ తో బాధపడేవారు పియర్స్ ను తినొచ్చు. ఇది షుగర్ లెవెల్స్ ను నార్మల్ గా ఉంచుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.

Latest Videos

click me!