వీటిని తింటే తలనొప్పి వస్తుందట

First Published Jan 5, 2024, 12:59 PM IST

తలనొప్పి ఎన్నో కారణాల వల్ల వస్తుంది. ఇది కొన్ని గంటల వరకు ఉంటుంది. అయితే తలనొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుని చికిత్స చేయించుకోవడం చాలా అవసరం. 
 

జీవితంలో ఒక్కసారైనా తలనొప్పిని అనుభవించని వారు ఒక్కరూ ఉండరు. నిజానికి తలనొప్పి ఎన్నో కారణాల వల్ల వస్తుంది. ఒత్తిడి, పని భారం, మానసిక సమస్యలతో పాటుగా వివిధ అనారోగ్య సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది. అందుకే దీనికి గల కారణాలను తెలుసుకుని చికిత్స తీసుకోవాలి. అయితే వైద్య సహాయం లేకున్నా.. విశ్రాంతి తీసుకుంటే చాలా వరకు తలనొప్పి తగ్గి పోతుంది. తలనొప్పిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మైగ్రేన్ నొప్పిని భరించడం చాలా కష్టం. అయితే కొంతమందికి కొన్ని ఆహారాలను తింటే మైగ్రేన్ నొప్పి ఎక్కువ అవుతుంది.  ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

కాఫీ

కాఫీని ఉదయం సాయంత్రం తాగేవారు చాలా మందే ఉన్నారు. కాఫీ మనల్ని ఎనర్జిటిక్ గా మారుస్తుంది. అయితే కొంతమందికి కాఫీని తాగితే తలనొప్పి తగ్గిపోతుంది. కానీ మరికొంతమందికి మాత్రం కాఫీని తాగితే తలనొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ యే తలనొప్పిని పెంచుతుంది. 
 

dark chocolate

చాక్లెట్

చాక్లెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ ను తింటే ఒత్తిడి తగ్గడంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే చాక్లెట్లో కెఫిన్, బీటా-ఫెనిలెథైలామైన్ ఉంటాయి. ఇవి  కొంతమందిలో తలనొప్పిని కలిగిస్తాయి.
 

జున్ను

జున్నులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలుంటాయి. నిజానికి ఇది మనల్ని ఎన్నో సమస్యలకు దూరంగా ఉంచుతుంది కూడా. అయితే కొంతమందికి జున్నును తింటే తలనొప్పి వస్తుంది. అందుకే జున్నును అతిగా తినకూడదు. 
 

ఆల్కహాల్

మైగ్రేన్ తలనొప్పికి మితిమీరిన మద్యపానం కూడా ఒక కారణమని అందరికీ తెలిసిందే. ఆల్కహాల్ ను తాగడం వల్ల మైగ్రేన్లు పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అందుకే మందును రెగ్యులర్ గా, ఎక్కువగా తాగకూడదు.

Tamarind

పులుపు

పులుపు ను ఇష్టపడనివారుండరు. ఎందుకంటే పులుపు కూరలు ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి కూడా తలనొప్పిని కలిగిస్తాయి. ముఖ్యంగా చింతపండు, పెరుగు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల కూడా కొందరిలో తలనొప్పి వస్తుంది.
 

click me!