మూత్రపిండాలు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అలాగే శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపుతాయి. రక్తాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత.. ఇవి మూత్రంతో విషాన్ని బయటకు పంపుతాయి. అయితే మూత్రపిండాల పనితీరులో ఏదైనా ఆటంకం ఏర్పడితే మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు మన రక్తంలోనే ఉండిపోతాయి. దీనివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. మన జీవనశైలి, అధిక బరువు లేదా మరేదైనా వ్యాధి కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. నిజానికి మూత్రపిండాల్లో రాళ్లు.. ఖనిజాలు, లవణాలతో ఏర్పడుతాయి. ఇవి ఇసుక రేణువుల లాగే చిన్నవి నుంచి టెన్నిస్ బంతి లాగ పెద్దగా ఉంటాయి.