వీటిని తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది

First Published | Jul 18, 2023, 1:16 PM IST

క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. దీన్ని వీలైనంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటేనే దీన్నుంచి బయటపడతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పండ్లు, కూరగాయలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. 

ప్రస్తుత కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రోగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. కానీ ఈ వ్యాధి మొదట్లో ఎలాంటి లక్షణాలను చూపించదు. దీనివల్లే ఎంతో మంది అర్థాంతరంగా చనిపోతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి  సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ ఒక్క ఆహారం నేరుగా క్యాన్సర్ ను నిరోధించనప్పటికీ ఆహారంలోని కొన్ని భాగాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.

చక్కెర వినియోగాన్ని తగ్గిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. క్యాన్సర్ రాకూడదంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. పండ్లు, కూరగాయలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. పేలవమైన కడుపు ఆరోగ్యం కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. కొంతమందిలో ఒత్తిడి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్యాన్సర్ ప్రమాదం తగ్గాలంటే ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 


క్యారెట్లు

క్యారెట్లు విటమిన్ ఎ కు మంచి వనరులు. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి. అలాగే కంటి సమస్యలను తగ్గిస్తాయి. క్యారెట్లు చర్మానికి కూడా మంచి మేలు చేస్తాయి. అంతేకాదు క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.

Broccoli

బ్రోకలీ

బ్రోకలీలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలవని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.

cabbage

క్యాబేజీ

క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి. దీంతో క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. 

టమాటాలు

క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి టమోటాలు సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. టమాటాల్లో పుష్కలంగా ఉండే లైకోపీన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. 
 

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు, బ్లాక్బెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీ పండ్లు కూడా క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడతాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.  వాటిని నాశనం చేస్తాయి.
 

బీన్స్

బీన్స్ లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బీన్స్ కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పసుపు

పసుపులోని ఔషదగుణాల కారణంగా దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో రోగాలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలను నివారిస్తుంది.
 

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఎన్నో ఔషదగుణాలున్న మసాలా దినుసులు. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Latest Videos

click me!