ఇలా చేస్తే, మీరు ఎప్పటికీ బరువు తగ్గలేరు...!

First Published | Jul 17, 2023, 3:04 PM IST

దాని వల్ల తినాల్సిన దానికంటే ఎక్కువ తినేస్తారట. అందుకే బ్రేక్ ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు.

Weight Loss

చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, చాలా సార్లు కొందరు ఏం చేసినా బరువు తగ్గలేరు. అలా వారు బరువు తగ్గలేకపోవడానికి వారు చేసే తప్పులే కారణం కావచ్చు. మరి అలాంటి అలవాట్లు ఏంటో ఓసారి చూద్దాం..
 

Weight Loss

1.బరువు తగ్గాలనే ఆలోచనతో చాలా మంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ, ఇలా చేయడం వల్ల ఆకలి మరింత పెరుగుతుంది. దాని వల్ల తినాల్సిన దానికంటే ఎక్కువ తినేస్తారట. అందుకే బ్రేక్ ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు.
 


Weight Loss

2.చాలా మంది బరువు తగ్గాలి అనుకున్న వారు తమ ఆహారంలో ప్రోబయోటిక, ప్రీ బయోటిక్ ఆహారాలు తీసుకోవాలి. కానీ, చాలా మంది ఇవి తీసుకోరట. అలా తీసుకోకపోవడం వల్ల కూడా బరువు తగ్గలేరు.

Weight Loss

3.బరువు తగ్గాలి అనుకునేవారు మంచినీరు ఎక్కువగా తాగాలి. కానీ, అలా మంచి నీరు తక్కువగా తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గలేరు. కాబట్టి, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి.

4.ఇక బరువు తగ్గాలి అనుకునేవారు తీసుకునే ప్రతి ఆహారంలో క్యాలరీ కౌంట్ చేస్తూ ఉంటారు. నిజంగా అలా క్యాలరీ కౌంట్ చేసేవారు అయితే, వారు స్మార్ట్ ఫోన్ లో మీరు తీసకునే ఫుడ్ వాటి క్యాలరీలు చెక్ చేసుకొని, తర్వాత తినాలి. ఇక స్నాక్స్ సమయంలో  కుకీస్ లాంటివి తినకూడదు.

Weight Loss

5.ఇక స్నాక్స్ గా కూడా ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ని ఎంచుకోవాలి. నట్స్ లాంటివాటిని తినాలి. ఇవి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతామనే భయం  ఎక్కువగా ఉండదు. ప్రోటీన్ తీసుకుంటేనే బరువు తగ్గగలం.

6.ఇక చాలా మంది బరువు తగ్గాలనే కోరికతో డెయిర్ ఉత్పత్తులు తమ డైట్ లో నుంచి తొలగించేస్తారు. కానీ, అలా చేయకూడదట.  శరీరంలో కాల్షియం లేకపోతే, బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి, పాలు, పనీర్ లాంటివి తీసుకోవాలి.

7.ఇక చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అలా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా శరీరంలో క్యాలరీలు పెరిగి, బరువు పెరుగతారే తప్ప, తగ్గే అవకాశం ఉండదు.

8. ఇక చాలా మంది డైట్ ఒక్కటి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ, అలా చేయడం వల్ల ఉఫయోగం ఉండదు. డైట్ తో పాటు వ్యాయామాలు చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఉపయోగం ఉంటుంది.

Latest Videos

click me!