వీటిని తింటే రక్తంలో చక్కెర కంట్రోల్ లో ఉంటుంది

First Published | Jul 16, 2023, 2:53 PM IST

డయాబెటీస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే  ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

diabetes

మాక్రోన్యూట్రియెంట్స్ మన శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి, శక్తిని ఉత్పత్తి చేయడానికి, వ్యాధులను నివారించడానికి అవసరమైన ఆహారాలు. వీటిలో ఫైబర్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు ఉంటాయి. ఫైబర్ ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మధుమేహులు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చిక్కుళ్లు

చిక్కుళ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన బరువును నియంత్రించడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో రెసిస్టెంట్ స్టార్చ్ కూడా ఉంటుంది. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే హైపోగ్లైసీమియాను నివారిస్తుంది. రక్తంలో చక్కెరను కూడా తగ్గిస్తుంది.


ఆకుకూరలు 

బచ్చలికూర, క్యాబేజీ,  బీట్రూట్ వంటి ఫైబర్స్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. 
 

తృణధాన్యాలు

తృణధాన్యాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తాయి. ఇవి మధుమేహులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
 

nuts

గింజలు

చియా సీడ్స్, అవిసె గింజలు, నువ్వులు, బాదం పప్పు, వాల్ నట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ ఉన్నవారికి గొప్ప ఆహారం. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే బ్లడ్ షుగర్ పెరగకుండా  ఉంటుంది. 
 

పండ్లు

డయాబెటిస్ నియంత్రణ కోసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లను తినండి. జామకాయ, బెర్రీలు, ఆపిల్, నారింజ, మోసంబి వంటి సిట్రస్ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి.
 

Latest Videos

click me!