belly fat loss
బెల్లీ ఫ్యాట్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే కొన్ని ఆహారాలు శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడంలో ఎఫెక్టీవ్ గా సహాయపడతాయి. ఇలాంటి ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అదనపు కిలోల బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అయితే బరువు తగ్గడానికి డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తినేవారున్నారు. డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వల్ల వాటిలో ఉండే ఫైటేట్లు, ఆక్సలేట్ల ప్రభావం తగ్గుతుంది.
గింజలు, డ్రై ఫ్రూట్స్ లో ఫైటిక్ ఆమ్లం, టానిన్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇది పోషకాల శోషణను నిరోధిస్తుంది. అయితే వీటిని నానబెట్టడం వల్ల ఈ యాంటీన్యూట్రియెంట్ల మొత్తం తగ్గుతుంది. బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని డ్రై ఫ్రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం పప్పు
ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే బాదం బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. బాదంలోని మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, చక్కెర కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది.
walnut
వాల్ నట్
వాల్ నట్స్ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు ఉత్తమ వనరు. ఇది మంటను తగ్గించడానికి, కొవ్వు ఆక్సీకరణను పెంచడానికి సహాయపడుతుంది. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు జీవక్రియను పెంచడమే కాకుండా ఆకలిని నియంత్రించడానికి, అతిగా తినడాన్ని తగ్గించడానికి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
ప్లమ్
ప్లమ్ పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మూత్రపిండాల వ్యాధి, ఆర్థరైటిస్, రక్త ప్రవాహానికి చికిత్స చేయడానికి ప్లమ్ పానీయాలను ఉపయోగిస్తారు. రక్తహీనత, గుండె జబ్బులకు ప్లమ్ పండ్లను ఉపయోగించాలని వైద్యులు తరచుగా సిఫార్సు చేస్తుంటారు.
raisins
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియ ఆరోగ్యానికి మద్దతునిస్తుంది. అలాగే శరీరంలోని విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికారక టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఈ పానీయం కాలేయం జీవరసాయన ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అంజీర
డ్రై ఫ్రూట్స్ లో అంజీరను ఎక్కువగా తినేవారు చాలా మందే ఉన్నారు. అంజీర పండ్లలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్ సమృద్ధిగా ఉండే ఇవి గర్భిణీ స్త్రీలు తినగలిగే బెస్ట్ డ్రై ఫ్రూట్స్. పొటాషియం సమృద్ధిగా ఉండే ఇవి రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.