Anxiety
ఈ రోజుల్లో చాలా మందిలో యాక్సైంటీ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ చిన్న విషయాలకే ఆందోళనకు గురౌతున్నారు. అయితే, ఈ ఆందోళన పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా మీరు కూడా యాక్సైంటీతో ఇబ్బంది పడుతుంటే, ఈ కింది ఆహారాలు ప్రయత్నించండి.
1.అరటిపండ్లు..
అరటి పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. దీనిలో ట్రైపోటోఫాన్ పుష్కలంగా ఉంటుంది. అరటి పండ్లలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది మనసుకు ప్రశాంతత కలిగించేలా చేస్తుంది. కాబట్టి, ఒత్తిడిలో ఉన్న సమయంలో అరటి పండు తినాలి.
2.కోడిగుడ్లు..
కోడిగుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోనూ ట్రైపోటోఫాన్ ఉంటుంది. అందుకే, ఒత్తిడిలో ఉన్న సమయంలో గుడ్డు తినాలి. ఇది బ్రెయిన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
3.గ్రీన్ టీ..
గ్రీన్ టీ బరువు తగ్గడానికి మాబత్రమే కాదు, ఒత్తిడి తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఎక్కువగా ఆందోళనకు గురైనప్పుడు వెంటనే గ్రీన్ టీ తాగితే, ప్రశాంతంగా ఉంటుందట.
4.డార్క్ చాక్లెట్..
మనలో చాలా మంది చాక్లెట్స్ తినడానికి ఇష్టపడతారు. అయితే, ఈ చాక్లెట్ తినడం వల్ల కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చట. మెదడు ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
chamomile tea
5.చమోమిలే టీ: చాలా మంది నిద్ర ఆపుకోవడానికి టీ తాగుతూ ఉంటారు. అయితే ఈ టీ నిద్రను కలిగించేలా పనిచేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి చమోమిలే టీ మంచిది. చమోమిలే ఒక రకమైన పువ్వు. దీని టీ తయారు చేయడం కూడా చాలా సులభం. ఇది ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది.
Sea food
6.సీఫుడ్స్..
సీఫుడ్స్ సైతం మనలో ఒత్తిడి తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాక్సైంటీ లెవల్స్ తగ్గించడంలో సహాయపడతాయి.