బీపీ తగ్గడానికి ఏం తినాలి?

First Published Jan 28, 2024, 1:15 PM IST

అధిక రక్తపోటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అందులోనూ చాలా చిన్న వయసు వారికి కూడా హైబీపీ సమస్య వస్తోంది. అయితే కొన్ని ఆహారాలు తింటే ఈ బీపీ నార్మల్ అవుతుంది. 
 

blood pressure

ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే అధిక రక్తపోటు సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు చాలా చిన్న వయసు వారు కూడా ఈ ప్రాణాంతక సమస్య బారిన పడుతున్నారు. ఈ రక్తపోటును సకాలంలో గుర్తించకపోవడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అయితే రక్తపోటును నియంత్రించడానికి మీ రోజువారి ఆహారంలో మార్పులు చాలా చాలా అవసరం. అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి మీరు తినాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

అరటిపండ్లు

అరటిపండ్లు పోషకాలకు మంచి వనరులు. వీటిని తింటే తక్షణ ఎనర్జీ వస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండే ఈ అరటిపండ్లను తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

బచ్చలికూర

బీపీ పేషెంట్లక బచ్చలికూర ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో పొటాషియం, నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. బచ్చలికూరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే  అధిక రక్తపోటు తగ్గుతుంది. 

బీట్ రూట్

బీట్ రూట్ ను కూడా బీపీ పేషెంట్లు తినొచ్చు. దీనిలో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందుకే బీట్ రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నివారించొచ్చు.
 

వాల్ నట్స్

వాల్ నట్స్ మంచి పోషకాహారం. దీనిలో జింక్, కాల్షియం, ఇతర యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. 
 

దానిమ్మ పండ్లు

దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దానిమ్మ పండ్లు కూడా అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. 
 

click me!