Curd Rice
తేలికపాటి, ఆరోగ్యంగా ఉండే ఫుడ్ ఏదంటే కిచిడీ అని చాలా మంది చెప్తుంటారు. అయితే ఈ లీస్ట్ లో పెరుగన్నం కూడా ఉంది. పెరుగన్నం కూడా తేలికపాటి భోజనమే. అందులోనూ దీని టేస్ట్ అదిరిపోతుంది. అందుకే పిల్లలతో పాటుగా పెద్దలు కూడా పెరుగన్నాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం పదండి.
Curd Rice
అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం
పెరుగు అన్నాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది. నిజానికి పెరుగు అన్నం అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి మనకు సహాయపడుతుంది. అలాగే ఇది మన జీర్ణవ్యవస్థ, ప్రేగులను కూడా రక్షిస్తుంది.
గట్ ఆరోగ్యం
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి పెరుగు అన్నం మంచి ఆప్షన్. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియా సంఖ్యను కూడా మెరుగుపరుస్తుంది. ప్రోబయోటిక్స్ కడుపు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.
Image: Freepik
ఎముకలు, దంతాలకు ప్రయోజనకరం
పెరుగులో మెండుగా కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఇది మన ఎముకలు, దంతాలకు చాలా చాలా అవసరం. అందుకే పెరుగు అన్నం తినడం వల్ల మన ఎముకలు, దంతాలు బలపడతాయి. దంతాలు, ఎముకల సమస్యలొచ్చే ప్రమాదం కూడా తప్పుతుంది.
Curd Rice
బరువు నిర్వహణ
బరువు పెరగకుండా ఉండాలంటే మీరు పెరుగన్నాన్ని ఖచ్చితంగా తినండి. పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ మీ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. అలాగే గట్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇది మీ ఆరోగ్యకరమైన బరువుకు సహాయపడుతుంది. పెరుగులో ఉండే ప్రోటీన్, కాల్షియం కంటెంట్ మీ ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Curd rice
సమృద్ధిగా పోషకాలు
అన్నం, పెరుగును కలిపితే రుచికరమైన వంటకం తయారవుతుంది. అంతేకాదు ఈ ఫుడ్ లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పెరుగులో ఉండే ప్రోటీన్ కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీనిలోని క్యాల్షియం ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది. అలాగే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్ మీ శక్తిని పెంచుతుంది.