బెండకాయ కూర తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Jan 25, 2024, 12:59 PM IST

చాలా మందికి బెండకాయ కూర అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇది కొంచెం జిగటగా ఉంటుంది. ఈ కారణంగానే కూర ఎంత టేస్టీగా ఉన్నా అస్సలు తినరు. కానీ బెండకాయ కూరను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా? 
 

బెండకాయ హెల్తీ కూరగాయ. దీన్ని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. బెండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు బెండకాయలో కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండే బెండకాయను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాదు ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

బెండకాయ విటమిన్ కె కు అద్బుతమైన మూలం. రక్తం గడ్డకట్టడానికి, డీఎన్ఏ సంశ్లేషణకు ముఖ్యమైన ఫోలేట్ కూడా ముఖ్యమైనది. ఇది కూడా బెండకాయలో మెండుగా ఉంటుంది. బెండకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, మంటతో పోరాడటానికి సహాయపడతాయి.

okra

బెండకాయను తింటే ఆర్థరైటిస్, హృదయ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లతో సహా ఎన్నో ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది. బెండకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. 

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, మలబద్దకాన్ని నివారించడానికి డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. బెండకాయలోని ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోటాను నిర్వహించడానికి,  ప్రయోజనకరమైన బ్యాక్టీరియా  పెరగడానికి సహాయపడుతుంది. 

Okra

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే పెద్దప్రేగు క్యాన్సర్, ఇతర జీర్ణశయాంతర సమస్యలొచ్చే ప్రమాదం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండే  బెండకాయ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. 
 

బెండకాయలోని కరిగే ఫైబర్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బెండకాయలో ఉండే పొటాషియం సమ్మేళనం రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రక్తపోటు వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గుతుంది. 

Image: Getty Images

బెండకాయలోని కరిగే ఫైబర్స్ జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి బెండకాయను తినొచ్చు. బెండకాయను సమతుల్య ఆహారంలో చేర్చుకోవడం వల్ల గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుంది.

click me!