డయాబెటీస్ పేషెంట్లు ఈ పండ్లను తింటే..!

First Published | May 30, 2023, 3:40 PM IST

డయాబెటీస్ ను నియంత్రిండంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. డయాబెటీస్ పేషెంట్లు స్టార్చ్ తక్కువగా,  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. 
 

diabetes

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా మనదేశంలో రోజు రోజుకు ఈ సంఖ్య బాగా పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితినే డయాబెటీస్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలి. కంటి నిండా నిద్రపోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. టైం ప్రకారం మందులు వేసుకోవాలి. మధుమేహాన్ని నియంత్రించడంలో ఆహారం పాత్ర ఎనలేనిది. అయితే పండ్ల విషయంలో మధుమేహులు కొంచెం భయపడతారు. ఎక్కడ అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయోనని.  మరి మధుమేహులు తినదగిన పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పీచ్

పీచ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు తినదగిన పండ్లలో పీచ్ ఒకటి. పీచ్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని ఎలాంటి భయం లేకుండా తినొచ్చు.

Latest Videos


Image: Freepik

పియర్

డయాబెటీస్ పేషెంట్లకు పియర్ మంచి మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి బరువును నియంత్రించడానికి, తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. దీనిలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

Image: Getty

ఆపిల్

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో యాపిల్స్ అద్బుతంగా సహాయపడుతుంది. ఆపిల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆపిల్ తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉండటమే కాదు. జీర్ణ సమస్యలు కూడా నయమవుతాయి. 
 

చెర్రీలు

చెర్రీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చెర్రీలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చెర్రీలు మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తాయి. 

kiwi

కివి

కివీల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి  కివి డయాబెటిస్ ఉన్నవారు తినగల ఉత్తమ పండ్లలో ఒకటి. కివి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Strawberries

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి పండ్లను డయాబెటీస్ పేషెంట్లు ఎంచక్కా తినొచ్చు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి . వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

Image: Getty Images

దానిమ్మ

దానిమ్మ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం నుంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. దానిమ్మలో 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని అందించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. 
 

grapes for health

ద్రాక్ష

ద్రాక్షలో మధుమేహాన్ని నియంత్రించే పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.  కాబట్టి వీటిని డయాబెటీస్ పేషెంట్లు ధైర్యంగా తినొచ్చు. వీటిని తింటే మీ శరీరం హైడ్రేట్ గా ఉండటంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి. 

Image: Getty Images

జామకాయ

రోజుకో జామకాయను తిన్నా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ పండులో  గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జామకాయను మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా తినొచ్చు. 
 

పుచ్చకాయ

పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు వీటిని పుష్కలంగా తినొచ్చు. ఈ పండ్లు మూత్రపిండాలను రక్షించడానికి కూడా  సహాయపడతాయి. 

click me!