డయాబెటీస్ నుంచి వెయిట్ లాస్ వరకు.. పనీర్ ను తింటే లాభాలే లాభాలు..

First Published May 30, 2023, 1:58 PM IST

పనీర్ లో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పనీర్ ను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. 
 

పనీర్ పోషకాలు పుష్కలంగా ఉన్న ముఖ్యమైన పాల ఉత్పత్తులలో ఒకటి. కాటేజ్ చీజ్ అని కూడా పిలువబడే పనీర్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తింటే మన శరీరంలో ఎన్నో పోషకాల లోపాలు తొలగిపోతాయి. పనీర్ లో క్యాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి విటమిన్లు, మినరల్స్ వంటి శరీర ఎదుగుదలకు తోడ్పడే పదార్థాలు మెండుగా ఉంటాయి. అసలు పనీర్ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రోటీన్లు

పనీర్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పనీర్ లో అమైనో ఆమ్లాలు కూడా మెండుగా ఉంటాయి. శాఖాహారులు తినడానికి అనువైన ఆహారం ఇది. పనీర్ ను తింటే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. పోషకాల లోపం అలసట, బలహీనత, ఎముకల బలహీనత వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. 
 

వెయిట్ లాస్

పనీర్ లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. ఎందుకంటే ఇవి మీ ఆకలిని తగ్గించడానికి సహాయపడతాయి. అయితే పనీర్ ను మితంగానే తినాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 
 

Paneer Rezala

కండరాల ఆరోగ్యం

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పనీర్ ను తినడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మీ కండరాల సమస్యలను తగ్గిస్తుంది. 

మధుమేహులకు మంచిది

పన్నీర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే వీటిని డయాబెటీస్ పేషెంట్లు ఎంచక్కా తినొచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఏం పెంచవు. కానీ మితంగానే తినాలి. 

ఎముకలు, దంతాల ఆరోగ్యం

శరీర ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు, మినరల్స్ పనీర్ లో పుష్కలంగా ఉంటాయి. పనీర్ లో ఉండే కాల్షియం, ఫాస్పరస్ లు మన ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి, అవి ఎదగడానికి సహాయపడతాయి. అంతేకాదు బోలు ఎముకల వ్యాధి, కీళ్ల వ్యాధులు వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులొచ్చే ప్రమాదాన్ని కూడా ఇది కొంతవరకు తగ్గిస్తుంది. 
 

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలు వస్తాయి. అయితే పనీర్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

మెదడు ఆరోగ్యం

పనీర్ లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్  విటమిన్ బి 12 లోపాన్ని పోగొడుతుంది. 
 

ఒత్తిడి, ఆందోళన

పనీర్ ను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. 

click me!