
రోజు వంట చేస్తున్నప్పటికీ..కొన్ని చిన్న చిట్కాలు వంటని ,రుచిని మరింత పెంచుతాయి.వంటగదిలో చేసే ప్రతి పనికి కొన్ని కొన్ని స్మార్ట్ టచ్ లు జోడిస్తూంటే అవి వంటను మరింత ప్రత్యేకంగా మారుస్తుంటాయి.కేవలం రుచి, వాసన,టెక్స్చర్ మాత్రమే కాకుండా తిన్న తరువాత వచ్చే అనుభూతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
ఉదాహరణకి, రసం చేస్తుంటే అందులో చింతపండు నానపెట్టిన సమయంలో బెల్లం చిన్నముక్క కలిపితే, రసంలో వచ్చే రుచి ఇంకా బాగుంటుంది. అలాగే పాలకూరను బాగా మెత్తగా చేసిన తర్వాత దానికి చిటికెడు పసుపు కలపడం వల్ల ముద్దకు మంచి సువాసన వచ్చేస్తుంది. ఇది తినే ముందు నుంచే ఆకలి పెంచుతుంది.
ప్రతి ఇంట్లో దోసె తప్పనిసరిగా వేస్తుంటారు. దోసెను వేయించేటప్పుడు మధ్యలో చిన్న రంధ్రం చేసి అక్కడ నూనె వేస్తే అది బాగా క్రిస్పీగా వస్తుంది. అంతేకాకుండా రెండు పక్కల బాగా కాలుతుంది కూడా.
అరటిపండ్లు కొన్ని గంటల్లోనే నల్లగా మారిపోతాయి. వాటిని తాజాగా ఉంచాలంటే తడిగా ఉన్న బట్టలో చుట్టేస్తే మంచిది. అలాగే కొన్ని రకాల కూరగాయలు తరిగిన తర్వాత నల్లగా మారకుండా ఉండాలంటే నీటిలో కొద్దిగా పాలు కలిపి అందులో వేసి ఉంచితే చాలు – ఉదాహరణకి తరిగిన వంకాయలు, అరటికాయలు ఎంత సేపైనా మామూలుగానే ఉంటాయి.
ఇడ్లీ, దోసె పిండి కొన్ని సందర్భాల్లో చాలా తొందరగా పుల్లగా అయిపోతుంటాయి అప్పుడు ఏం చేయాలో తెలియక కొందరు వాటిని పాడేస్తుంటారు. కానీ దాన్ని మళ్లీ ఉపయోగించాలంటే మరిగించి చల్లబరిచిన పాలు కలిపితే పుల్లదనం తగ్గి కొత్త రుచిని అందిస్తుంది.
బంగాళాదుంపలు ఉడకబెట్టే సమయంలో కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె కలపడం వల్ల అవి విడిపోకుండా ఉంటాయి. ఇది మసాలా దోసా లేదా ఆలూ కర్రీ కోసం ఉపయోగపడే సూపర్ చిట్కా.అలాగే మెంతి సూప్ తయారు చేసుకునేటప్పుడు ముందే తగినంత ఉప్పు వేయడం వల్ల చివర్లో చేదుగా మారే ప్రమాదం తగ్గుతుంది.
కొత్తిమీర, పుదీనా చట్నీలు చెయ్యాలంటే ఎప్పుడూ చింతపండు వాడతాం. కానీ దాని బదులుగా ఎండబెట్టిన మామిడికాయ తురుము వేసుకుంటే వేరే లెవల్ టేస్ట్ వస్తుంది. ఇది ముఖ్యంగా రుచిని బాగా కోరుకునే వారికి బాగుంటుంది.
కొబ్బరి తురుము ఎప్పుడు అందుబాటులో ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. అలాగే, వేయించిన పదార్థాలపై చివర్లో కొద్దిగా కొబ్బరి నూనె చల్లి మిక్స్ చేస్తే ఆ వంటకానికి అదనపు వాసన, రుచి పెంచేస్తుంది.
ఇడియాప్పం కోసం పిండి కలుపుకునే సమయంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిస్తే పాన్‌కు అంటకుపోకుండా ఉంటుంది. ఇది సమయాన్ని కూడా బాగా ఆదా చేస్తుంది. ఇక కొత్తిమీరను నెయ్యిలో తక్కువసేపు వేయించి సాంబారులో వేసుకుంటే ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది.
తురిమిన కొబ్బరిని మిక్సీలో రుబ్బేటప్పుడు సాధారణ నీళ్లు కాకుండా వేడి నీళ్లు వేసి రుబ్బితే అధికంగా చిక్కటి కొబ్బరి పాలు వచ్చేస్తాయి. ఇదే చట్నీల్లోనూ, కర్రీలోనూ అదనపు రుచిని తెచ్చిపెడుతుంది.
పూరీ మెత్తగా రాకపోతే ఓ చిన్న మార్పు చేస్తే సరిపోతుంది. గోధుమ పిండి లోపల కొద్దిగా రవ్వ (సెమోలినా) కలిపి వేయిస్తే పూరీ బాగా పొంగి మంచి రుచిగా తయారవుతుంది.ఇన్‌స్టంట్ దోసెలు చేయాలంటే బియ్యాన్ని మజ్జిగలో రెండు గంటలపాటు నానబెట్టి, మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఆ మిశ్రమాన్ని తవ్వ మీద పోస్తే వెంటనే మెత్తటి దోసెలు రెడీ.
ఇదిలా ఉంటే ఎండిన నిమ్మకాయలు లేదా నారింజ తొక్కలను మసాలా రాక్‌లో ఉంచితే ఇంట్లో చీమలు, పురుగులు దూరంగా ఉంటాయి.
పాలకూర ప్యూరీ చేసేటప్పుడు కొబ్బరి కాకుండా కొబ్బరి పాలు వేస్తే తినడంలో కొత్త అనుభూతి ఉంటుంది. ఇక అప్పం పిండి రుబ్బేటప్పుడు అర కప్పు వడకట్టిన బియ్యం కలిపితే అది బాగా మృదువుగా తయారవుతుంది.
మనం డైలీ వంటలో వాడే చిట్కాలు. ఇవి పాటిస్తే వంటకి తక్కువ టైం పడుతుంది, రుచి బాగా ఉంటుంది, ప్లేటులో చేసే ప్రెజెంటేషన్ కూడా మంచిగా అనిపిస్తుంది. వంట వాసన, వంట దుర్వాసన తగ్గింపు, స్టోరేజ్, పిండి చిక్కదనం – అన్నిటికి సింపుల్ పరిష్కారాలు ఇవే.
ఈ చిట్కాలను సాధారణంగా మరిచిపోతాం. కానీ ఇవే రోజువారీ వంటను మాస్టర్ చెఫ్ స్థాయిలో మార్చగలవు.