Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి

Published : Sep 16, 2026, 05:30 PM IST

Store Raisins Fresh: వానాకాలం వచ్చిందంటే చాలు, గాలిలోని తేమకు డ్రై ఫ్రూట్స్ త్వరగా పాడవుతాయి. ఎండు ద్రాక్ష (కిస్మిస్) జిగురుగా, పుల్లగా మారకుండా ఎప్పటిలాగే ఫ్రెష్‌గా, తియ్యగా ఉండాలంటే ఒక సింపుల్ కిచెన్ చిట్కా ఉంది. అదేంటో ఇక్కడ చూద్దాం.

PREV
13
సింపుల్ ట్రిక్

వానాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల డబ్బాలో నిల్వ చేసిన ఎండు ద్రాక్ష త్వరగా జిగురుగా మారి, పుల్లటి వాసన వస్తుంది. ఇకపై ఆ టెన్షన్ వద్దు, దీన్ని ఆపేందుకు ఒక సింపుల్ ట్రిక్ ఉంది.

23
సిలికా జెల్

మనం కొత్త వాటర్ బాటిల్, బ్యాగ్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వాటిలో చిన్న 'సిలికా జెల్' (Silica Gel) ప్యాకెట్లు వస్తాయి. వాటిని చెత్తలో పడేయకుండా జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి.

సిలికా జెల్ డబ్బాలోని తేమను పూర్తిగా పీల్చుకుంటుంది. దీనివల్ల ఎండు ద్రాక్ష జిగురుగా మారదు, పుల్లటి వాసన రాదు. నెలల తరబడి కొత్తవాటిలాగే ఫ్రెష్‌గా ఉంటాయి.

సిలికా జెల్ ప్యాకెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చింపకండి. అలాగే అది నేరుగా ఎండు ద్రాక్షపై పడకుండా, మూతకు గట్టిగా అతుక్కుని ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

33
గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి

ఎండు ద్రాక్షను నిల్వ చేసే గాలి చొరబడని (Air-tight) గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాను తీసుకోండి. ఆ డబ్బా మూత లోపలి వైపు డబుల్ సైడ్ టేప్ వేసి, దానిపై ఈ సిలికా జెల్ ప్యాకెట్‌ను గట్టిగా అతికించండి.

Read more Photos on
click me!

Recommended Stories