మనలో చాలా మందికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత స్వీట్ కొంచెం అయినా తినాలని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది తినేస్తూ ఉంటారు కూడా. అయితే... భోజనం తర్వాత స్వీట్ తింటే చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు తెలుసా? అంటే మధ్యాహ్న భోజనం కాదు కానీ, రాత్రి భోజనం తర్వాత మాత్రం పొరపాటున కూడా స్వీట్ తినకూడదట. తింటే వచ్చే సమస్యలు ఏంటో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..