అతిగా తింటే అనర్థమే.. మఖానాతో ఎన్ని సమస్యలో ..!

First Published | Jun 24, 2023, 12:06 PM IST

నిజానికి మఖానా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే  ఎన్నో పోషకాలు ఉంటాయి. కానీ వీటిని అతిగా తింటే మాత్రం కిడ్నీల్లో రాళ్ల నుంచి విరేచనాల వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

పోషకాలు పుష్కలంగా ఉండే మఖానాలు ఎముకలకు బలాన్నిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. మఖానాలు మన శరీరంలో ప్రోటీన్ లోపాన్ని పోగొడుతాయి. జర్నల్ ఆఫ్ ప్లాంట్ న్యూట్రిషన్ లో ఒక పరిశోధన ప్రకారం.. మఖానాలో ఇనుము, జింక్, మెగ్నీషియం లు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే మఖానాలు కొన్ని సార్లు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 
 

మఖానాలను చిరుతిండిగా తీసుకుంటారు. కానీ మఖానాను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది మలబద్ధకం సమస్యను పెంచుతుంది. అలాగే స్కిన్ ఎనర్జీ, హై బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. అసలు మఖానాను అతిగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 


విరేచనాలు

మఖానాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే శరీరానికి పోషణ కూడా అందిస్తుంది. కానీ మీకు విరేచనాలు లేదా ఏవైనా జీర్ణ సమస్యలు ఉంటే మఖానాను పొరపాటున కూడా తినకండి. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే పోషకాలు ఉబ్బరం సమస్యను కలిగిస్తాయి. 
 

అలెర్జీలు 

యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్న మఖానాలను కాల్చి తినొచ్చు. అయితే చాలా మంది దీని ఖీర్ ను కూడా తింటారు. క్రమం తప్పకుండా వివిధ మార్గాల్లో మఖానాలను తింటుంటే మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది చర్మంపై దద్దుర్లు, దగ్గు, జలుబును కలిగిస్తుంది. వివిధ వ్యక్తులు శరీరాన్ని బట్టి అనేక రకాల అలెర్జీలను ఫేస్ చేసే అవకాశం ఉంది. మఖానా తినేటప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తే వాటిని తినడం ఆపేయండి. 

గర్భిణులు, డయాబెటిస్ ఉన్నవారు 

మీరు ఏవైనా మందులను వాడుతున్నట్టైతే మఖానాను తినడం మానుకోండి. అలాగే గర్భిణీ స్త్రీలు,పాలిచ్చే తల్లులు కూడా వీటిని తినకూడదు. ఒకవేళ తినాలనుకుంటే డాక్టర్ ను సంప్రదించాలి. దీన్ని మందుల సమయంలో తీసుకోవడం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. అందుకే తినడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోండి. ఇందులో ఉండే పిండి పదార్థం వల్ల శరీరంలో పిండి పదార్థం స్థాయి పెరుగుతుంది. ఇది దద్దుర్లు, దురద ప్రమాదాన్ని కలిగిస్తుంది.

makhana

రక్తపోటు

పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ కేలరీలు, సోడియం లేని ఈ సూపర్ ఫుడ్ తయారీలో ఉపయోగించే ఉప్పు శరీరంలో రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. దీని వల్ల హైపర్ టెన్షన్ తో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

మూత్రపిండాల్లో రాళ్లు

కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారు వీటిని తినడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది కిడ్నీ స్టోన్స్ గా మారుతుంది.  క్యాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో కాల్సిఫికేషన్ వచ్చే ప్రమాదం ఉంది.

Latest Videos

click me!