పైనాపిల్ ను తింటే బరువు తగ్గుతరా?

First Published | Jun 22, 2023, 1:02 PM IST

పైనాపిల్ లో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే..
 

పైనాపిల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పండు.  పైనాపిల్ మన ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరచడంతో సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉన్న ఈ పండులో 22 గ్రాముల పిండి పదార్ధం, 2.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటితో పాటుగా మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ మన చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

pineapple

పైనాపిల్ కూడా బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతుంది. ఈ పండును వెయిట్ లాస్ డైట్ లో చేర్చుకోవచ్చంటున్నారు నిపుణులు. పైనాపిల్ ఫైబర్ ఎక్కువగా, కేలరీలు చాలా తక్కువగా ఉండే పండు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పైనాపిల్ ను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు.


pineapple

పైనాపిల్ తినడం వల్ల జీర్ణక్రియకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పైనాపిల్ లో బ్రోమ లైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బ్రోమలైనన్ క్యాన్సర్ తో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే పైనాపిల్ ను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గాయాలు కూడా త్వరగా నయమవుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పైనాపిల్ లో ఉండే బ్రోమ లైన్ కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే పైనాపిల్ లో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. పైనాపిల్ ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పైనాపిల్ లో ఎముకల ఎదుగుదలకు అవసరమైన మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది.  ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. సయాటికా ఉన్నవారు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడానికి పైనాపిల్ ఎంతగానో సహాయపడుతుంది.

pineapple

పైనాపిల్ లో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పైనాపిల్ మన కంటి ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 

Latest Videos

click me!