dates
ఖర్జూరాలు విటమిన్లు, పోషకాల భాండాగారం. ఖర్జూరాల్లో పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి వాటిని మీ పిల్లలకు చక్కెరకు బదులుగా ఇవ్వొచ్చు. నిజానికి ఈ ఖర్జూరాలు పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అసలు ఖర్జూరాలు పిల్లలకు ఎలాంటి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
dates
గట్ ఆరోగ్యం
పిల్లల గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు ఖర్జూరాల్లో పుష్కలంగా ఉంటాయి. గట్ ఆరోగ్యం సరిగ్గా లేకుంటే కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కాగా ఖర్జూరాలను తింటే ఇలాంటి సమస్యలేమీ రావు. ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించి, గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఖర్జూరాలు మంచి జీవక్రియకు దారితీసే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచుతాయి.
dates
ఐరన్
ఏది పడితే అది తినే పిల్లల్లో ఇనుము లోపం ఉండే అలవాశం ఉంది. ఇనుము లోపం రక్తహీనత, అలసట వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. 2010 లో ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో రక్తహీనత 32.9 శాతంగా ఉందని సర్వేలు వెల్లడించాయి. ఇది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఎక్కువగా ఉంది. పిల్లల్లో ఇనుము లోపం ఉంటే వారు తరచుగా అలసిపోతారు. ఆకలి కూడా ఉండదు. అందుకే పిల్లలకు ఆకుకూరలు, కూరగాయలతో పాటుగా ఖర్జూరాలను వారి ఆహారంలో చేర్చాలి. ఖర్జూరాలు ఇనుముకు సహజ వనరు. కాబట్టి ఇ పిల్లల్లో ఇనుము లోపాన్ని పోగొడుతాయి.
dates
ఎముకలు బలోపేతం
పిల్లల ఎముకలు పెరుగుతూ ఉంటాయి. ఈ దశలో వారి ఎముకలను బలోపేతం చేసే కాల్షియం అనే పదార్ధం చాలా అవసరం. ఖర్జూరాల్లో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరాలు ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ ఖర్జూరాలు సహజంగా ఎముకలను బలంగా చేస్తాయి. ఖర్జూరాలలో రాగి, సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి ఎముకలకు సంబంధించిన సమస్యలను కూడా నివారిస్తాయి. వీటిలో విటమిన్ కె పుష్కలంగా కూడా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఎముకలను జీవక్రియ చేయడానికి సహాయపడుతుంది.
dates
యాంటీఆక్సిడెంట్
ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లం, కెరోటినాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ గుండె జబ్బులు, క్యాన్సర్ మొదలైన వాటికి దారితీయొచ్చు. అందుకే పిల్లలకు ఖర్జూరాలను తప్పకుండా ఇవ్వాలి. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ ను కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి కీలక పాత్ర పోషిస్తాయి.
dates
అదనపు చక్కెర అవసరాన్ని తొలగించగలవు
పిల్లలకు చక్కెరను ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది కావిటీస్ నుంచి ఊబకాయం లేదా డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. తీపి స్నాక్స్ కు బదులుగా పిల్లలకు ఖర్జూరాలను ఇవ్వొచ్చు.
ఖర్జూరాలు పోషకమైనవి
ఎన్నో రోగాలను కలిగించే కృత్రిమ స్నాక్స్ మాదిరిగా కాకుండా.. మీ పిల్లలకు ఖర్జూరాలను పెట్టండి. వీటిలో మీ పిల్లలకు అవసరమైన విటమిన్లు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కృత్రిమ ఆహారాలు కలిగించిన నష్టం నుంచి వారి శరీరాలు పెరగడానికి, నయం చేయడానికి సహాయపడుతుంది. ఖర్జూరాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
dates
ప్రతిరోజూ పిల్లలకు ఖర్జూరాలు ఇవ్వడం వల్ల వారిలో ఉత్సాహాన్ని పెంచొచ్చు. ఖర్జూరాల్లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలు. అంతేకాక, వీటిలో లభించే పొటాషియం పిల్లల మెదడు అభివృద్ధికి, మొత్తం పెరుగుదలకు సహాయపడుతుంది. ఐరన్ అధికంగా ఉండే ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో రక్తహీనతను నివారించవచ్చు.