Soft Chapati: చపాతీలు మెత్తగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు

Published : Mar 27, 2026, 01:56 PM IST

Soft Chapati: చపాతీలు  చేసిన కాసేపటికే  గట్టిగా అయిపోతున్నాయా? అయితే పిండి కలిపేటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు.  ఈ చిట్కాతో ఎన్ని గంటలైనా చపాతీలు మెత్తగా వస్తాయి. 

PREV
15
చపాతీలు గట్టిగా వస్తున్నాయా?

చపాతీలు చేయడం అందరికీ తెలుసు. కానీ, మెత్తగా చేయడం మాత్రం ఒక ఆర్ట్ అనే చెప్పాలి.  చపాతీలు చేసిన  చాలా గంటలపాటు మెత్తగా ఉంటూ, పొరలు పొరలుగా చేయడం అందరికీ రాదు.  ఇలాంటి సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా?  అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. చపాతీలు మెత్తగా వస్తాయి. 

25
పిండి కలపడంలోనే అసలు మ్యాజిక్...

చపాతీ చేయాలంటే పిండిని నీటితో కలుపకుంటాం. అయితే..  నార్మల్ నీరు కాకుండా.. పిండి కలపడానికి మీరు గోరు వెచ్చని నీటిని వాడాలి.  ఇలా చేస్తే.. పిండిలోని గ్లూటెన్ యాక్టివేట్ అవుతుంది. చపాతీలు మెత్తగా వస్తాయి.  కావాలంటే.. మీరు పిండి కలపడానికి పాలు కూడా ఉపయోగించవచ్చు. 

నూనె లేదా నెయ్యి..  పిండి కలిపేటప్పుడు ఒక టీ స్పూన్ నూనె లేదా నెయ్యి కలపాలి. ఇలా చేయడం వల్ల చపాతీ మృదుత్వాన్ని పెంచుతుంది. 

అంతేకాదు..  పిండిని కలుపుకునేటప్పుడు  బాగా కలపాలి.  పిండిని కనీసం 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా కలపాలి. తర్వాత పిండి పై కొద్దిగా నూనె రాసి.. తడి వస్త్రాన్ని కప్పి, 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. దీని వల్ల పిండి బాగా సాఫ్ట్ అవుతుంది. 

35
చపాతీలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చపాతీని ఒత్తేటప్పుడు అన్ని వైపులా ఒకేలా ఉండేలా చూసుకోండి. అంచులు మందంగా ఉంటే చపాతీ సరిగ్గా పొంగదు. అలాగే, ఒత్తేటప్పుడు పొడి పిండిని ఎక్కువగా వాడొద్దు. ఇది చపాతీని త్వరగా గట్టిగా మార్చేస్తుంది.
45
3. ఇలా కాల్చితేనే చపాతీ పొంగుతుంది
చపాతీ వేయడానికి ముందే పెనం (Tawa) బాగా వేడిగా ఉండాలి. తక్కువ వేడి ఉన్న పెనంపై వేస్తే చపాతీ గట్టిగా అవుతుంది. అందుకే మీడియం లేదా హై ఫ్లేమ్‌లో కాల్చడం మంచిది. పెనంపై చపాతీ వేసిన తర్వాత చిన్న బుడగలు రాగానే రెండో వైపుకు తిప్పాలి.
55
4. హాట్‌బాక్స్‌లో ఇలా స్టోర్ చేయండి
కాల్చిన చపాతీలను వెంటనే ఒక కాటన్ క్లాత్‌లో చుట్టి హాట్‌బాక్స్‌లో పెట్టండి. దీనివల్ల వచ్చే ఆవిరి, చపాతీలను ఎక్కువసేపు మెత్తగా ఉంచుతుంది.
Read more Photos on
click me!

Recommended Stories