ఉల్లి, వెల్లుల్లిని వండకుండా.. పచ్చిగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Oct 8, 2024, 5:13 PM IST

ఉల్లిపాయ, వెల్లుల్లిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే చాలా మంది వీటిని వండే తింటుంటారు. కానీ వీటిని పచ్చిగా తింటే ఏమౌతుందో తెలుసా? 

మనం చేసే ప్రతి కూరలో ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి కూరలను మంచి టేస్టీగా చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు ఈ రెండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తాయి. 

కొంతమంది  చికెన్, మటన్, బిర్యానీ  ఇలా చాలా ఫుడ్స్ తినేటప్పుడు ఉల్లిపాయల్ని పచ్చిగా తింటుంటారు. అలాగే కొన్ని వంటల్లో కూడా ఉల్లిపాయల్ని, వెల్లుల్లిని పచ్చిగా కూడా వాడుతుంటారు. అంటే మజ్జిగలో పచ్చి ఉల్లిపాయనే వేస్తారు. అలాగే కొన్ని రకాల చట్నీలు, పచ్చల్లలో వెల్లుల్లిని పచ్చిగానే కలుపుతారు. అసలు  ఇలా ఉల్లిపాయల్ని, వెల్లుల్లిని పచ్చిగా తినడం మంచిదేనా?అన్న సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఉల్లిని, వెల్లుల్లిని పచ్చిగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

వెల్లుల్లి, ఉల్లిపాయల్ని పచ్చిగా తినడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచి.. మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. 

కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది

ఉల్లిపాయలు, వెల్లుల్లిలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని పచ్చిగా తిన్నప్పుడు కూడా మన శరీరానికి అందుతాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా బాగా తగ్గిస్తాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెపోటు ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి. 

జీర్ణక్రియకు సహాయపడుతుంది:

ఉల్లిపాయలు, వెల్లుల్లి గట్ లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి బాగా సహాయపడుతుంది. అందుకే వీటిని పచ్చిగా తింటే మంచిదంటారు. వీటిలో ఉండే ప్రీబయోటిక్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చికాకు కలిగించే కడుపు వ్యాధి లక్షణాలను కూడా తగ్గిస్తుంది. అయితే ఉడికించిన ఉల్లిపాయలు జీర్ణక్రియకు సహాయపడతాయి.


గుండె రక్షణ:

వెల్లుల్లి, ఉల్లిలో ఉండే పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తంలోని లిపిడ్ కంటెంట్ ను మెరుగుపరుస్తాయి. అందుకే గుండె జబ్బులొచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

క్యాన్సర్ నివారణ:

వెల్లుల్లి, ఉల్లిపాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పచ్చిగా తింటే అందుతాయి. ఇది శరీర మంటను తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు,క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల్ని పచ్చిగా తింటే మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు అందుతాయి. ఇది కడుపు, మల క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. 

పచ్చి వెల్లుల్లి, ఉల్లి తినడం వల్ల వచ్చే సమస్యలు

ఉల్లిపాయల్ని, వెల్లుల్లిని పచ్చిగా తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయినప్పటికీ వీటిని మోతాదులోనే తినాలి. అది ఏ ఫుడ్ అయినా సరే ఎక్కువగా తింటే సమస్యలే వస్తాయి. మీరు ఉల్లి, వెల్లుల్లిని పచ్చిగా ఎక్కువగా తింటే మాత్రం జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, అలెర్జీలు మొదలైన సమస్యలు వస్తాయి. అందుకే వీటిని అతాగా తినకండి. ముఖ్యంగా పరిగడుపున తినడం మానుకోండి. ఉల్లిపాయల్లో శీతలీకరణ గుణాలుంటాయి. కాబట్టి వర్షాకాలంలో పచ్చిగా తినకండి. ఎండకాలంలో ఇది శరీరానికి మేలు చేస్తుంది.

ఉల్లిపాయ, వెల్లుల్లి రెండూ మంచి పోషకాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ వీటిని పచ్చిగా తింటే వాటిలో ఉండే సల్ఫర్ నోటి దుర్వాసన, చెమట వాసనను కలిగిస్తుంది. 

Latest Videos

click me!