టమాటాలు రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 8, 2024, 10:25 AM IST

మనం చేసే ప్రతి కూరలో టమాటాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా. అయితే లిమిట్ కి మించి టమాటాలను తింటే మాత్రం కీళ్ల నొప్పులతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

tomatoes

ప్రతి కూరను టేస్టీగా చేయడానికి టమాటాలను ఖచ్చితంగా వేస్తారు. అంతేకాదు సలాడ్లలో కూడా వీటిని బాగా తింటారు. ఇవి కేవలం టేస్టీగా ఉండటమే కాదు మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి.

టమాటాల్లో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే టమాటాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్తారు. 

tomatoes

వేరే దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలో మాత్రం ప్రతి కూరలో టమాటాలను వేస్తుంటాం. ఈ టమాటాను తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అలాగే శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి.

అయినా కానీ దీనివల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును అన్నింటితో పాటుగా టమాటాను కూడా అతిగా తింటే మీరు ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

టమాటాలు ఎక్కువగా తింటే కీళ్ల నొప్పులు పెరుగుతాయా? 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. టమాటాలు, కీళ్ల నొప్పులకు మధ్య సంబంధం ఉంది. టమాటాలు నైట్ షేడ్ కుటుంబానికి చెందినవి. ఈ టమాటాలు ఒక్కటే కాదు బంగాళాదుంపలు, మిరపకాయలు, వంకాయ వంటి ఇతర కూరగాయలు కూడా దీనికి చెందినవే.

అయితే నైట్ షేడ్ కుటుంబంలోని కూరగాయల్లో సోలనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులను బాగా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 


tomatoes

మీకు ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే.. మీరు టమాటాలను అతిగా తింటే ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టమాటాలు, కీళ్ల నొప్పుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని చూపించే కొన్ని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా మందికి టమాటాలను తింటే కీళ్ల నొప్పులు ఎక్కువ ఏం కావు. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా లైకోపీన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంటే టమాటాలు మంటను తగ్గిస్తాయన్న మాట. 

ఏదేమైనా నైట్ షేడ్ కుటుంబానికి చెందిని కూరగాయలకు ఎవ్వరికైనా సున్నితత్వం ఉంటే మాత్రం టమాటాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టమాటాలను తింటే మీకు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు లేదా ఏదైనా సమస్య వస్తే మాత్రం వీటిని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

tomatoes

టమాటాలను ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు 

అది ఏదైనా సరే అతిగా తింటే లేనిపోని సమస్యలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది టమాటాలకు కూడా వర్తిస్తుంది. అసలు టమాటాలను ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?

కిడ్నీ స్టోన్స్: టమాటాలు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న వారికి మంచివి కావు. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తింటే మన శరీరంలో ఆక్సలేట్ పేరుకుపోతుంది.

దీనివల్ల మీకు కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు టమాటాలను తినకపోవడమే మంచిది. లేదంటే స్టోన్స్ పెద్దగా అవుతాయి.

యాసిడ్ రిఫ్లెక్స్: టమాటాల్లో మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి  సమస్యలు వస్తాయి. అందుకే టమాటాలను ఎక్కువగా తినకూడదు. 
 

tomatoes

అలెర్జీ: టమాటాల్లో ఉండే ఓ మూలకం అలెర్జీ, చర్మపు దద్దుర్లను కలిగిస్తుంది. ముఖ్యంగా స్కిన్ అలర్జీ ఉన్నవారికి ఇవి మంచివి కావు. కాబట్టి టమాటాలను ఎక్కువగా తినకూడదు. 

లైకోపెనోడెర్మియా :  టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. లైకోపెనోడెర్మియా అంటే ఈ లైకోపీన్ మన రక్తంలో ఎక్కువగా ఉండటం. దీనివల్ల మీ స్కిన్ కలర్ పాలిపోతుంది. నిజానికి ఇది మన ఆరోగ్యానికి మంచిదే. కానీ దీన్ని రోజుకు 75 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. 

కీళ్లలో వాపు: మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా టమాటాలను ఎక్కువగా తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రావడమే కాకుండా... కీళ్లలో వాపు కూడా వస్తుంది. ఇకపోతే టమాటాల్లో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది కీళ్ల నొప్పికి కారణమవుతుంది. 

Latest Videos

click me!