దానిమ్మ: దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక దానిమ్మ తింటే గుండె బలంగా ఉంటుంది. ప్రయత్నించి చూడండి.
నారింజ: నారింజ ఒక రకమైన సిట్రస్ పండు. ఇది విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో ప్లేక్ పేరుకుపోకుండా నిరోధిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమంగా తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి వీలైనంత వరకు నారింజ పండ్లను కొని తినండి.
ద్రాక్ష: ద్రాక్షలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా ద్రాక్ష తినడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.