ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు సాధారణంగా తినే ఆహారాలలో సాబుదానా ఒకటి. దీన్ని కిచిడీ, టిక్కీ, లడ్డూ వంటి ఎన్నో రకాలుగా వంట చేసుకుని తింటారు. నిజానికి సాబుదానా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
రెండురోజుల్లో నవరాత్రుల పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ పండుగకు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. అంతేకాదు చాలా మంది ఈ తొమ్మిది రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటారు. మీరు కూడా ఉపవాసం ఉంటున్నట్టైతే సాబుదానాను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఎంతుకంటే ఇది మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అసలు సాబుదానాను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు పెరగడానికి..
మీరు మరీ సన్నగా ఉన్నారా? బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే మీరు మీ ఆహారంలో సాబుదానాను చేర్చుకోండి. ఎందుకంటే దీనిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని మీరు రెగ్యుటర్ గా తింటే వేగంగా బరువు పెరుగుతారు.బరువు పెరగడానికి మీరు బ్రేక్ ఫాస్ట్ లో పాలు, జొన్నలు తినొచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ప్రస్తుత కాలంలో జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఎక్కువయ్యారు. అయితే సాబుదానా ఈ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ఫుడ్ చాలా సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం సమస్యలు ఉన్నవారు తమ రోజువారి ఆహారంలో వీటిని చేర్చుకోవచ్చు. ఇది గట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఎముకలకు మేలు
పోషకాలు పుష్కలంగా ఉండే సాబుదానా మన ఎముకలను బలంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ చిన్న చిన్న ధాన్యాలలో కాల్షియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ సగ్గుబియ్యంతో చేసిన వంటకాన్ని తిన్నా లేదా పాలతో కలిపి తీసుకున్నా బోలు ఎముకల వ్యాధి, కీళ్లనొప్పుల ముప్పు తగ్గుతుంది.
శరీరం శక్తివంతం
సగ్గుబియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే అలసట, బలహీనత వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇందుకోసం మీరు వీటిని పాలలో కలిపి తినాలి. దీన్ని తినడం వల్ల బలహీనత తొలగిపోతుంది.
హైబీపీ రోగులకు ప్రయోజనకరం
ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అంటు తేడా లేకుండా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే సగ్గుబియ్యం ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే ఈ సమస్యతో బాధపడుతున్నవారు సగ్గుబియ్యాన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.