ప్లేట్ లెట్ కౌంట్ పెరగాలంటే వీటిని తినండి

First Published | Oct 12, 2023, 2:53 PM IST

డెంగ్యూ జ్వరం తో పాటుగా ఇతర కారణాల వల్ల కూడా కొందరిలో ప్లేట్ లెట్ కౌంట్ బాగా పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. అందుకే ప్లేట్ లెట్ కౌంట్ ను వీలైనంత తొందరగా పెంచుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు ప్లేట్ లెట్ కౌంట్ ను బాగా పెంచుతాయి. 

platelet count

ప్లేట్లెట్స్ మన రక్తంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ చిన్న కణాలు.. చిన్న లేదా పెద్ద పెద్ద గాయలను నయం చేయడానికి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. ఇది అధిక రక్త నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అయితే కొంతమందిలో వివిధ కారణాల వల్ల ఈ ప్లేట్ లెట్ కౌంట్ బాగా పెరుగుతుంది. కానీ ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే అది మీ ఆరోగ్యంపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడతాయి. అవేంటంటే..

దానిమ్మ పండ్లు

దానిమ్మ పండ్లు పోషకాలకు మంచి వనరులు. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజకరంగా ఉంటాయి. వీటిని తింటే శరీరంలో రక్తం పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మ పండ్లను తినడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ బాగా పెరుగుతుంది.
 


బొప్పాయి

బొప్పాయి మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ  లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే కూడా  ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. అలాగే బిప్పాయి ఆకురసం తాగినా ప్లేట్ లెట్ కౌంట్ బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
 

బచ్చలికూర

బచ్చలికూరలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇది మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ కె, ఐరన్ ఎక్కువగా ఉండే బచ్చలికూరను తినడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది.
 

బీట్ రూట్

బీట్ రూట్ ను తింటే ఒంట్లో రక్తం పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది.
 

గుమ్మడికాయ

గుమ్మడికాయను తినేవారు చాలా తక్కువే. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉండే గుమ్మడికాయలను తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం. ఇవి పోషకాలకు అద్భుతమైన మూలం. రోజూ ఒక గుడ్డును తింటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చన్న సంగతి చాలా మందికి తెలుసు. అయితే ఇవి కూడా ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచడానికి సహాయపడతాయన్న సంగతి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. 
 

బ్రోకలీ

బ్రోకలీ పోషకాల భాండాగారం. ఈ క్రూసిఫరస్ కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి.  ఈ రెండూ ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి ఎంతో సహాయపడతాయి.
 

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్స్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. 

Latest Videos

click me!