చాలా పండ్లు, కూరగాయలను మనం తొక్క తేసేసి, ఆ తర్వాత తింటూ ఉంటాం. కానీ,చాలా కూరగాయలు, పండ్లలోని తొక్కల్లోనే ఎక్కువ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్లు ఉంటాయట. అందుకే, ఈ కింది కూరగాయల తొక్క మాత్రం అస్సలు తొలగించకూడదట. అవేంటో ఓసారి చూద్దాం..
కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం, ఎందుకంటే అవి మీ శరీరాన్ని పోషించడానికి , మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. కొన్ని కూరగాయల పై తొక్క అవసరమైన పోషకాల నిధిని కలిగి ఉంటుంది.