మందులు వాడకుండా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం ఎలా?

First Published Jan 13, 2024, 10:45 AM IST

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అయితే కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు చాలా మంది మందులను కూడా వాడుతుంటారు. కానీ మందులు వాడకుండా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. ఎలాగంటే?

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది లైట్ తీసుకునేంత చిన్న సమస్య అయితే కాదు. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటుతో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో వారికి స్ట్రోక్, కొరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అనేది కాలేయం ఉత్పత్తి చేసే ఒక మైనపులాంటి పదార్థం.

cholesterol

నిజానికి ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి మన శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే ధమనులు ఇరుగ్గా మారుతాయి. దీంతో రక్తప్రవాహం సరిగ్గా ఉండదు. రక్తం సరిగ్గా సరఫరా కాకపోతే గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. చెడు ఆహారాలు, స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలే కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తాయి. ఇక చాలా మంది కొలెస్ట్రాల్ ను నియంత్రించేందుకు మందులను కూడా వాడుతుంటారు. కానీ కొన్ని రకాల ఆహారాలు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


leafy vegetables

ఆకు కూరలు

ఆకు కూరల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫోలెట్, ఫైబర్స్, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఎన్నో రకాల విటమిన్లు, ఐరన్, లుటిన్ వంటి ఇతర పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ ఆకు కూరలను మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మీ శరీరానికి ఈ పోషకాలన్నీ అందుతాయి. దీంతో మీకు గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. 

avocado

అవొకాడో

అవొకాడో కూడా హెల్తీ ఫుడ్. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవొకాడోలో పోషకాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవొకాడోలో ఉండే ఫైబర్స్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నాణ్యతను మెరుగుపరుస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వారానికి రెండు అవొకాడోలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

Citrus fruits

సిట్రస్ పండ్లు

నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. పెక్టిన్ అనేది ఒక రకమైన కరిగే ఫైబర్. ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

click me!