మకర సంక్రాంతి నాడు ఏయే వంటలు చేస్తారో తెలుసా?

First Published | Jan 12, 2024, 1:14 PM IST

Makar Sankranti 2024: పండుగల విషయానికొస్తే.. గుమగుమలాడే పిండి వంటలు, స్వీట్లు పక్కాగా ఉండాల్సిందే. పండుగలప్పుడు ఏ ఇంట్లో అయినా నోరూరించే వంటల వాసన ముక్కును ముంచుతుంది. మరి మకర సంక్రాంతి నాడు ఏయే స్పెషల్ వంటలు చేస్తారో తెలుసా? 

మకర సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగను పంజాబ్, గుజరాత్ నుంచి మహారాష్ట్ర, తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రం తమదైన స్పెషల్ పద్దతిలో జరుపుకుంటాయి. సంక్రాంతి పండు పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. అలాగే  ఇప్పటి నుంచి రోజులు కూడా ఎక్కువ కావడం ప్రారంభిస్తాయి. మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తరాయణుడు అవుతాడు. అంటే ఈ రోజు సూర్యుడు ఉత్తరం వైపు కదులుతూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని హిందీలో మకరం అని కూడా పిలుస్తారు. 


ఇక సంక్రాంతికి గాలిపటాల జోరు, రంగురంగుల  ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు  ఇలా ఒక్కటేమిటీ.. ఈ పండుగకు ప్రతి ఒక్కటీ స్పెషల్ గానే ఉంటుంది. వీటన్నింటికీ మించి నోరూరించే పిండివంటకాలు మాత్రం చాలా స్పెషలనే చెప్పాలి. మరి మకర సంక్రాంతి నాడు చేసే కొన్ని సాంప్రదాయ వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


నువ్వుల లడ్డూలు

మకర సంక్రాంతి స్పెషల్ లడ్డూలు ఇవి. అవును చేతితో చేసే నువ్వుల లడ్డూ మకర సంక్రాంతి స్పెషల్ స్వీట్. ఈ నువ్వుల లడ్డులూ ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతేకాదు ఈ నువ్వుల లడ్డూలు మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. అంటే ఎక్కువగా చలి పెట్టదు. అలాగే నువ్వుల్లో, బెల్లంలో ఉండే పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ లడ్డూలను బెల్లం, నువ్వులతో తయారుచేస్తారు. 

పల్లి పట్టి

పల్లిపట్టిని మకర సంక్రాంతి రోజూ కూడా చేస్తారు. నిజానికి దీన్ని తయారుచేయడం చాలా ఈజీ. అవును పల్లిపట్టిని జస్ట్  బెల్లం, పల్లీలను ఉపయోగించి తయారుచేస్తారు. చలికాలంలో ఈ పల్లిపట్టీలను ఎక్కువగా తింటుంటారు. గుర్ అని కూడా పిలువబడే బెల్లం మకర సంక్రాంతి సమయంలో ఎంతో పవిత్రమైనందిగా భావిస్తారు. 
 

మకర చౌలా

మకర చౌలాను కొత్త బియ్యం, పాటు, బెల్లం, అరటి, చెరకును ఉపయోగించి తయారుచేస్తారు. ఈ వంటను చాలా స్పెషల్ గా భావిస్తారు. ఈ వంటకాన్ని ముందుగా భోగంగా దేవుడికి సమర్పిస్తారు. ఆ తర్వాత దీన్ని ప్రసాదంగా పెడతారు. 
 

కిచిడి

మకర సంక్రాంతి నాడు తప్పకుండా కిచిడీని వండుతారు. ఇది మకర సక్రాంతి స్పెషల్ వంటకం కూడా. కిచిడీని సాధారణంగా మకర సంక్రాంతి పండుగలో భోజనానికి తయారు చేస్తారు. బియ్యం, పెసరపప్పు, అన్నంతో తయారు చేసే ఈ ఫుడ్ లోకి నెయ్యిని కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. 

చక్కెర పొంగలి 

మకర సక్రాంతి నాడు ప్రతి ఒక్కరూ చక్కెర పొంగలిని ఖచ్చితంగా వండుతారు. ఇది బియ్యం ఆధారిత వంటకం. చక్కెర పొంగలిని బియ్యం, బెల్లం, పెసరపప్పులను ఉపయోగించి తయారుచేస్తారు. దీని టేస్ట్  అదిరిపోతుంది. 

వెన్ పొంగల్

వెన్ పొంగల్ కూడా చక్కెర పొంగలిలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అన్నం, పెసరపప్పు, జీడిపప్పు, కొబ్బరి, జీడిపప్పు, కరివేపాకు, నెయ్యిని ఉపయోగించి చేస్తారు. దక్షిణ భారతదేశంలో వెన్ పొంగల్ ను అల్పాహారంగా తింటారు. 

click me!