Fertility Diet: సంతానోత్పత్తి పెరగడానికి స్త్రీ, పురుషులు తినాల్సిన పండు ఇది..

First Published | Jan 12, 2024, 11:50 AM IST

Fertility Diet: దానిమ్మ పండులో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. అలాగే స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. 

Fertility Diet: దానిమ్మ పోషకాలు పుష్కలంగా ఉండే ప్రయోజనకరమైన పండు. ఈ పండును తినడం వల్ల ఒంట్లో రక్తం పెరుగుతుది. అలాగే  గుండె, చర్మం, పొట్ట, మెదడు, జుట్టు ను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. మీకు తెలుసా? ఈ పండును తింటే స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి సామార్థ్యం కూడా పెరుగుతుంది. 

దానిమ్మ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పండును తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎముకలు బలోపేతం అవుతాయి. కండరాలను నిర్మించడానికి కూడా ఈ పండు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండును తింటే మన జీర్ణక్రియను సరిగ్గా ఉంటుంది. అలాగే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. శరీరం కూడా సక్రమంగా పనిచేస్తుంది. ఈ విధులన్నింటికీ.. మన శరీరానికి దానిమ్మలో ఉన్న పోషకాలన్నీ అవసరం. 


కానీ ఈ ప్రస్తుత కాలంలో మనం మనం అనుసరిస్తున్న జీవనశైలి మనల్ని ఎన్నో రోగాల బారిన పడుస్తుంది. అలాగే శరీరం కూడా ఫిట్ గా ఉంటడం లేదు. ఆకలిగా అనిపించినప్పుడు కడుపును నింపే వాటినే తింటున్నాం. కానీ అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయా? లేదా? అనేది మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాక నిద్రపోవడానికి, నిద్రలేవడానికి  ఒక నిర్ధిష్ట సమయాన్ని ఫాలో అవ్వండం లేదు. ముఖ్యంగా వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. కానీ ఇవన్నీ మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్నిచూపిస్తాయి. 
 

ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషులు ఎదుర్కొంటున్నారు ఒక సాధారణ సమస్య సంతానోత్పత్తి సమస్య. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో పోషకాల లోపమే ఇందుకు ప్రధాన కారణమని కొందరు నిపుణులు అంటున్నారు. కాగా స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచడానికి దానిమ్మ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అసలు మనకు దానిమ్మ ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పడు తెలుసుకుందాం పదండి. 
 

దానిమ్మ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

దానిమ్మ తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే వీర్యం నాణ్యత కూడా మెరుగుపడుతుంది. ఈ పండు కామోద్దీపన ఫుడ్ కూడా. దీన్ని తింటే లైంగిక వాంఛ పెరుగుతుంది. సంతానోత్పత్తి సమస్యలతో బాధపడేవారు దీన్ని తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.

హార్మోన్ల సమస్యలతో బాధపడుతున్న ఆడవారికి దానిమ్మ పండు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల పీసీఓఎస్, సంతానోత్పత్తి, జుట్టు రాలడం, మొటిమలు వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. 

అధిక రక్తపోటు పేషెంట్లకు కూడా దానిమ్మ పండు మంచి మేలు చేస్తుంది. ఈ పండు తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తం కూడా తగ్గుతుంది. ముందే అధిక రక్తపోటు పేషెంట్లకు గుండె జబ్బులొచ్చే ముప్పు ఎక్కువ. కాబట్టి మీరు ప్రతి రోజూ  ఒక దానిమ్మ పండును తినడానికి ప్రయత్నించండి. 

విరేచనాలు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ ఉన్నవారు కూడా దానిమ్మ పండును తినొచ్చు. ఈ పండు ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. 

దానిమ్మ పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి దానిమ్మ పండును తింటే శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్, మంట వంటి సమస్యలను ఎదుర్కోవడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

ఈ పండు షుగర్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా అంటే ఈ పండును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

వీటన్నిటితో పాటు దానిమ్మ తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. మొత్తంగా దానిమ్మ పండుతో ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న మాట. 
 

Latest Videos

click me!