అలసటను పోగొట్టేందుకు, హాయిగా నిద్రపోయేందుకు పెసరపప్పు ఎంతగానో సహాయపడుతుంది. సాధారణంగా మనం ఈ పప్పును పప్పు చారుగా, కిచిడీలో ఎక్కువగా తింటుంటాం. వీటితో పాటుగా మొలకెత్తిన పెసరపప్పును కూడా తినొచ్చు. ఎందుకంటే ఇది మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసరపప్పును తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పుల్లో మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..