ఎండు ద్రాక్షని ఎంత మోతాదులో తిన్నా పర్వాలేదు ఇందులో విటమిన్ బి పొటాషియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండు ద్రాక్ష తినవచ్చు. అలాగే వాల్ నట్స్ రోజుకి మూడు నాలుగు నుంచి తీసుకోకూడదు. వాల్నట్స్ మీద ఉండే స్కిన్ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉండదు.
కానీ 90 శాతం ఆంటీ ఆక్సిడెంట్సు ఫెనోలికే యాసిడ్స్ ఈ స్కిన్ లోనే ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. అలాగే బాదం గింజలు రోజుకి నాలుగు నుంచి ఏడు గింజల వరకు తినటం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఖర్జూరం ఇది తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది.
ఇందులో ప్రాక్టోజ్ రిచ్ గా ఉంటుంది మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండడానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. అలాంటి ఈ ఖర్జూరాన్ని రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. అయితే నట్స్ ని నేరుగా కాకుండా నానబెట్టి తినటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.