డయాబెటీస్ పేషెంట్లు నేరేడు పండ్లను తింటే..!

First Published | Jun 11, 2023, 11:27 AM IST

నేరేడు పండ్లలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఈ పండును తింటే ఎన్నో అనారోగ్య  సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ పండు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

jamun

ఎండాకాలంలో నేరేడు పండ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను పోగొడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచుతుంది. 

నేరేడు పండులో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఏదేమైనా ఈ పండు మధుమేహులు తినొచ్చా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?
 


నేరేడు పండ్లలో డయాబెటిక్ పేషెంట్లకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ నేరేడు పండ్లను తినడం వల్ల ఇన్సులిన్ యాక్టివిటీ పెరుగుతుంది. డయాబెటిస్ రాకుండా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది.

నేరేడు పండ్లలో జాంబోలిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది. జామున్ లోని ఎక్కువ ఆల్కలాయిడ్ కంటెంట్ హైపర్ గ్లైసీమియా లేదా రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఈ పండుతో పాటుగా విత్తనాలు, ఆకులు, బెరడు నుంచి తీసిన సారాలు కూడా శరీరంలో  రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.

Jamun

నేరుడు పండును ఎన్నో విధాలుగా తినొచ్చు. వీటిని అలాగే పచ్చిగా  తినొచ్చు. లేదా దాని జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. అలాగే దీనిని సలాడ్లు, స్మూతీలు, జామ్లు మొదలైన వాటిలో ఉపయోగించొచ్చు. దీన్ని మెత్తని పొడిగా చేసి నేరుగా తినొచ్చు.

Latest Videos

click me!