మనలో చాలా మంది ప్రతిరోజూ పెరుగును తింటుంటారు. పెరుగులో విటమిన్ బి2, విటమిన్ బి12, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పెరుగులో ఉండే గుణాలు వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములతో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే పెరుగులో ప్రోటీన్లు, విటమిన్లు, లాక్టోబాసిల్లస్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.