గర్భిణులు బొప్పాయిని తినొచ్చా? తింటే ఏమౌతుంది?

Published : Jun 10, 2023, 03:22 PM IST

ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయిని తింటే గర్భస్రావం అవుతుందని చాలా మంది అంటుంటారు. మరి ఇది నిజమా? కాదా? అన్న సంగతిని తెలుసుకుందాం..  

PREV
15
గర్భిణులు బొప్పాయిని తినొచ్చా? తింటే ఏమౌతుంది?
papaya

గర్భిణులు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహారం తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్నిచూపుతుంది. ఇకపోతే బొప్పాయి ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల సమృద్ధికి ప్రసిద్ది చెందింది. ఇలాంటి పండును గర్బిణులు తినొచ్చా? లేదా? అన్న దానిపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

25
papaya

బొప్పాయిలో ఫోలిక్ ఆమ్లం, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ, పిండం సరైన అభివృద్ధికి చాలా అవసరం. బొప్పాయి జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం, ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సాధారణ గర్భధారణ అసౌకర్యాల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

35
papaya


గర్భధారణ సమయంలో బొప్పాయిని తినడం సురక్షితమేనా?

బొప్పాయిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినప్పటికీ.. గర్భధారణ సమయంలో బొప్పాయిని తినకపోవడమే మంచిది. బొప్పాయిలో కనిపించే పాపైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. ఇది గర్భస్రావం లేదా అకాల ప్రసవానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. బొప్పాయి కూడా అమ్నియోటిక్ సంచి చీలిపోవడానికి కారణమవుతుందని. ఫలితంగా అమ్నియోటిక్ ద్రవం కోల్పోయి పిండానికి ప్రమాదం జరుగుతుంది. అందుకే ఈ సమయంలో బొప్పాయిని తినకపోవడే మంచిది. 
 

45
papaya seeds

బొప్పాయిలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. గర్భధారణ సమయంలో పండిన బొప్పాయిలను తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది పిల్లలు బరువు తక్కువగా ఉండేందుకు, పిండంలో అభివృద్ధి సమస్యలు లేదా ముందస్తు ప్రసవం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ హార్మోన్ల ప్రభావాన్ని గుర్తుంచుకోవడం, బొప్పాయిని మితంగా తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. 

55
papaya

గర్భధారణ సమయంలో బొప్పాయిని సురక్షితంగా తినడం ఎలా?

గర్భధారణ సమయంలో బొప్పాయిని తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలంటే మాత్రం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

పూర్తిగా పండిన బొప్పాయి: పండని లేదా సగం పండిన బొప్పాయిలతో పోలిస్తే పూర్తిగా పండిన బొప్పాయిలో తక్కువ పాపైన్ ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో తినడానికి సురక్షితం.

మితంగా తినడం ముఖ్యం: రోజుకు ఒక కప్పు పూర్తిగా పండిన బొప్పాయిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఏదైనా అసౌకర్యం లేదా అలెర్జీ వంటి సమస్యలు వస్తే దీన్ని తినకపోవడమే మంచిది.
 

Read more Photos on
click me!

Recommended Stories