థైరాయిడ్ పేషెంట్లు ఓట్స్ ను తింటే?

First Published | May 30, 2023, 12:36 PM IST

థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా పనిచేయడానికి ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం చాలా ముఖ్యం. థైరాయిడ్ పేషెంట్లు ఓట్స్ ను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

thyroid cancer

ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలనే తింటున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో  ఓట్స్ ఒక్కటి. ఓట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇవి మన శరీర బరువును తగ్గిస్తాయి. జీర్ణ సమస్యలను పోగొడుతాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మరెన్నో విధాలుగా మన  ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఓట్స్. వోట్మీల్ తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటును తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. రోజుకు ఒక కప్పు ఓట్ మీల్ థైరాయిడ్ ను కూడా దూరం చేస్తుంది. నిజానికి మన రోగాలను పూర్తిగా నయం చేయడానికి ప్రపంచంలో మ్యాజిక్ ఫుడ్ లేదు. కానీ థైరాయిడ్ కోసం వోట్స్ వంటి కొన్ని ఆహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. 

thyroid

థైరాయిడ్ వ్యాధి అంటే ఏంటి?

మన మెడ దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్లు శ్వాస, జీర్ణక్రియ, మానసిక స్థితి, బరువు, హృదయ స్పందన రేటులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి దీనిని అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. మీ థైరాయిడ్ హార్మోన్లను అదుపులో ఉంచడానికి మీరు చేయాల్సిన పనుల్లో ఒకటి సరైన ఆహారాన్ని తినడం.
 


సూడాన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం..  థైరాయిడ్ పనితీరు సక్రమంగా ఉండేందుకు సమతుల్య ఆహారాన్ని తినడం చాలా అవసరమని కనుగొన్నారు. ఓట్స్ ను ఈ డైట్ లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


థైరాయిడ్ కోసం ఓట్స్

ఓట్స్ విటమిన్ బి, విటమిన్ ఇ, జింక్, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుముకు అద్భుతమైన మూలం. ఇవన్నీ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. వీటి సమతుల్యతను కాపాడుతాయి. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అవసరమైన అయోడిన్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది. ఓట్స్ లో అవెనాంత్రామైడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఓట్స్ లో మాత్రమే కనిపించే డై-ఫినోలిక్ ఆమ్లాల సమూహం. పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉండే ఓట్స్ మంటను తగ్గించడానికి, థైరాయిడ్ సంబంధిత స్వయం ప్రతిరక్షక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.

ఓట్స్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు థైరాయిడ్ కు మాత్రమే పరిమితం కాదు. దీనిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఓట్స్ శరీరానికి శక్తిని అందిస్తుంది.
 

ఓట్స్ ను ఎలా తినాలి? 

థైరాయిడ్ తో బాధపడేవారికి ఓట్స్ మంచి ఆహారం. మీ ఆరోగ్య పరిస్థితి, మీరు ప్రతిరోజూ తినే రకాన్ని బట్టి 30-50 గ్రాముల ఓట్స్ ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చడానికి మీరు ఓట్స్ గంజిని తాగండి. ఓట్స్ ను ఉప్మా, ఓట్స్ స్మూతీ, ఓట్స్ చిల్లా లేదా దోశ లు చేసుకుని తినొచ్చు.

Latest Videos

click me!