హైదరాబాదీ ఇరాన్ చాయ్... ఇంట్లోనే చేయచ్చు ఎలానో తెలుసా?

First Published | Jun 14, 2024, 4:30 PM IST

దాదాపు టీ ని అందరు ఇళ్లల్లో చేసుకుంటారు. కానీ.. ఇరానీ ఛాయ్ కి వచ్చిన టేస్ట్ మాత్రం రాదు. కానీ.. ఇప్పుడు ఈ ఇరానీ ఛాయ్ ని మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.


హైదరాబాద్ ఫుడ్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు.  హైదరాబాద్ నగరంలో  దొరకని ఫుడ్ అంటూ ఏది ఉండదు. ఫుడ్ ప్రియులు అందుకే ఈ ప్లేస్ ని వదిలివెళ్లడానికి ఇష్టపడరు. ఏ స్టేట్ ఫుడ్ అయినా ఈజీగా లభిస్తుంది. ఎన్ని ఫుడ్ లభించినా.. ఈ నగరానికి అంటూ కొన్ని స్పెషల్స్ ఉన్నాయి. అందులో బిర్యానీ ఎంత ఫేమసో... ఛాయ్ కూడా అంతే ఫేమస్.

Irani Chai

దాదాపు టీ ని అందరు ఇళ్లల్లో చేసుకుంటారు. కానీ.. ఇరానీ ఛాయ్ కి వచ్చిన టేస్ట్ మాత్రం రాదు. కానీ.. ఇప్పుడు ఈ ఇరానీ ఛాయ్ ని మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇరానీ టీ చేయడానికి కావలసిన పదార్థాలు:
పాలు - 500 మి.లీ
టీ పొడి 2 - చెంచా
చక్కెర 2 - చెంచా
కండెన్స్‌డ్ మిల్క్ - 2 చెంచాలు ఏలకులు - 2
నీరు - 2 కప్పులు

ఇరానీ టీ తయారీ విధానం..
ఇరానీ టీ చేయడానికి, ముందుగా స్టవ్ మీద పాన్ ఉంచండి. దానికి 2 కప్పుల నీరు కలపండి. తర్వాత అందులో టీ పొడి, పంచదార వేసి ప్లేట్‌తో మూతపెట్టాలి. మూత పెడితే టీ పొంగిపోతాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. మొత్తం కవర్ చేయకుండా మూత పెట్టి...  పొంగిపోనివ్వకుండా.. దాదాపు 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. 

ఆ తర్వాత స్టౌ మీద మరో కడాయి పెట్టి అందులో పాలు వేసి మరిగించాలి. పాలలో  యాలకులను చూర్ణం చేసి జోడించండి. తర్వాత పాలను ఒకసారి బాగా కలపాలి. పాలు బాగా మరిగించి సగానికి తగ్గిన తర్వాత అందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి మళ్లీ మరిగించాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న డికాషన్ ని పాలలో కలుపుకుంటే సరిపోతుంది. ఇరానీ ఛాయ్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి చూడండి. 

Latest Videos

click me!