భోజనం చివర్లో పెరుగు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 14, 2024, 12:12 PM IST


చాలా మంది పెరుగును ఇష్టంగా తింటుంటారు. పెరుగును ఎక్కువగా భోజనం చివర్లోనే తింటుంటారు. ఇలా తినడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. భోజనం లాస్ట్ లో పెరుగుతో అన్నం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బరువు తగ్గుతారు

భోజనం చివర్లో పెరుగును తినడం బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో ప్రయోజనకరంగా  ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెరుగులో ఉండే ఉండే కార్టిసాల్ అనే హార్మోన్ పనితీరును సరిచేస్తుంది. అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఇమ్యూనిటీ 

రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే అంటువ్యాధులు, ఇతర రోగాలు వస్తుంటాయి. అలాగే ఎలాంటి వ్యాధి సోకినా అది చాలా రోజులదాకా తగ్గదు. అయితే భోజనం చివర్లో పెరుగును తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది శరీరంలోని హానికారక క్రిములతో పోరాడుతుంది.
 


జీర్ణక్రియకు సహాయం 

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. అలాగే మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. దీంతో మన పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.


ఎముకలు బలోపేతం 

పెరుగులో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఇందులో ఫాస్పరస్ కూడా ఉంటుంది. కాల్షియం బోలు ఎముకల వ్యాధి వంటి ఎన్నో ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది.

గుండె ఆరోగ్యం 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా పెరుగు ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పెరుగు  మన గుండె ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇది ధమనుల చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ ప్రసరణను సరిచేస్తుంది.

పోషకాలు సమృద్ధి

పెరుగులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి 12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

అధిక రక్తపోటు

పెరుగు అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ఉండే  మెగ్నీషియం రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

జుట్టు, చర్మ సంరక్షణకు 

పెరుగులోని లాక్టిక్ యాసిడ్ నేచురల్ లాలాజలంగా పనిచేసి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే పెరుగులో విటమిన్లు, ప్రోటీన్లు కూడా మెండుగా ఉటాయి. ఇవి మెరిసే, బలమైన జుట్టుకు సహాయపడతాయి. 

Latest Videos

click me!