వేడి పాలు, చల్ల పాలు.. ఆరోగ్యానికి ఏ పాలు మంచివంటే?

First Published | Jun 14, 2024, 3:40 PM IST

పాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అయితే పాలతో మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే మాత్రం వీటిని సరైన మార్గంలోనే తాగాలి. అదెలాగంటే?
 

పాలలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పాలను తాగాలని చెప్తుంటారు. పాలు పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. ఎముకలను బలంగా చేస్తాయి. మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఏదేమైనా పాల ప్రయోజనాలు పొందాలంటే మాత్రం పాలను ఏ విధంగా తాగాలో ఖచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొంతమంది వేడి పాలను తాగితే, మరికొంతమంది చల్లని పాలను తాగుతుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పాలు ఏ విధంగా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గోరువెచ్చని పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

పాలలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే గోరువెచ్చని పాలను తాగితే ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. అలాగే విరేచనాలు, ఉబ్బరంతో సహా సూర్యరశ్మి ప్రేరిత జీర్ణ లక్షణాలను ఈ పాలు నివారిస్తాయి. ఇది మీరు కంటినిండా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే గోరువెచ్చని పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపించడానికి పనిచేస్తుంది.
 


చల్లటి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఎండాకాలంలో చల్లటి పాలను తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అంటుంటారు. ఇది నిజమే. ఎసిడిటీ సమస్య ఉన్నవారికి చల్లని పాలు ప్రయోజనకరంగా ఉంటాయి. చల్లని పాలలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరం నిర్జలీకరణంతో పోరాడటానికి సహాయపడతాయి.
 

వేసవిలో ఏ పాలను ఎలా తాగాలి? 

వేడి పాలు లేదా చల్లటి పాలు.. రెండూ సమానంగా ఆరోగ్యకరమైనవి. అలాగే పోషకమైనవి కూడా. పగటిపూట పాలు తాగితే చల్లగా తాగొచ్చని నివేదికలు చెబుతున్నాయి. రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

పాలు తాగడానికి ఆరోగ్యకరమైన మార్గం 

పడుకునే ముందు గోరువెచ్చని పాలను తాగితే మంచిది. ఇది మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే మీరు ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడుతుంది. పగటిపూట పాలు తాగడం వల్ల మంచి స్థాయి సంతృప్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

రోజూ పాలు తాగడం మంచిదేనా?

లాక్టోస్ అసహనం కలిగి ఉండకపోతే లేదా పాలకు అలెర్జీ లేకపోతే ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక గ్లాసు పాలను తాగొచ్చు. 

Latest Videos

click me!