మొలకలు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!

First Published | Jun 15, 2024, 4:24 PM IST

మొలకల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ... పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. దీనిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. 

Sprouts


బరువు తగ్గాలనుకునే వారు, ఫిట్‌నెస్ ప్రియులు తమ ఆహారంలో తరచూ మార్పులు చేస్తుంటారు. ఎక్కువగా మొలకెత్తిన విత్తనాలను తింటారు. మొలకెత్తిన బీన్స్ అధిక విటమిన్ , మినరల్ కంటెంట్ కారణంగా పోషక శక్తిగా పరిగణిస్తారు. అవి ముఖ్యంగా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ప్రొటీన్లు, మెగ్నీషియం, విటమిన్ సి , కె అధికంగా ఉండటం వల్ల మొలకలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది , రోజంతా నిండుగా ఉంచుతుంది.

అయితే.. బరువు తగ్గడమేకాదు... మొలకలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పెసలతో తయారు చేసే మొలకలు మరింత ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొలకల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ... పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. దీనిలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కి మంచి సోర్స్. తక్కువ కొవ్వు కలిి ఉంటాయి. ప్రతిరోజూ 100గ్రాముల పెసర మొలకలు తీసుకుంటే.. 30 కేలరీలు మనకు అందుతాయి.
 


ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మొలక ల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు, ముఖ్యంగా ఫోలేట్లు, థయామిన్‌లను కలిగి ఉంటాయి. 100 గ్రాముల మూంగ్ స్ప్రౌట్స్‌లో ఎక్కువ మొత్తంలో కాపర్, ఐరన్, మాంగనీస్, పాస్పరస్, కాల్షియం, జింక్, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి.

చిక్‌పీ మొలకలు తినడం వల్ల వాటి ప్రయోజనాలను పెంచుకోవచ్చు. మొలకెత్తిన శనగల్లో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, ఫోలేట్ ,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మొలకెత్తిన బీన్స్‌లో ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి ఎసిడిటీని నివారిస్తాయి.

bean sprouts

మొలకెత్తిన కందిపప్పులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. వీటిలో విటమిన్ ఎ ఉంటుంది. కంటి ఆరోగ్యానికి , కంటి చూపును మెరుగుపరుస్తుంది. వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొలకెత్తిన శెనగలను ఆహారంలో చేర్చుకోవచ్చు.

sprouts

ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మొలకెత్తిన శెనగలు శరీరానికి శక్తిని అందించి బరువు తగ్గడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మొలకెత్తిన బీన్స్ తినడం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

Latest Videos

click me!