పెరుగు పుల్లగా కాకూడదంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Jun 15, 2024, 3:08 PM IST

ఒకటి రెండు రోజుల్లోనే పెరుగు పుల్లగా అయిపోతుంది. పుల్లని పెరుగను తినడం చాలా కష్టం. అందుకే పుల్లగా అయితే వెంటనే డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలతో పెరుగు పుల్లగా కాకుండా చూసుకోవచ్చు. అదెలాగంటే?


పెరుగు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. కానీ చాలా రోజులుంటే పెరుగు పుల్లగా అవుతుంది. ఈ పుల్ల పెరుగును తినడం చాలా కష్టం. పెరుగు పుల్లగా ఉంటే చాలా మందికి నచ్చదు. అందుకే పుల్లగా అయిన పెరుగును వెంటనే డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలతో పెరుగు వెంటనే పుల్లగా కాకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

curd

పెరుగు పుల్లగా కాకూడదంటే పెరుగు పైభాగం, అంచుల నుంచి ద్రవాన్ని తొలగించాలి. దీంతో పెరుగు పులుపు చాలా వరకు తగ్గుతుంది.  అలాగే పాలలో పెరుగు వేసిన తర్వాత బాగా కలపాలి. ఇది పెరుగును ఎక్కువ పుల్లగా చేయదు. అయితే వేడి వేడి పాలలో పెరుగు అస్సలు వేయకూడదు. 

Latest Videos


పెరుగు పుల్లగా కాకూడదంటే ఉదయాన్నే పెరుగును ఫ్రీజ్ చేయకూడదు. ఉదయాన్నే పెరుగును ఫ్రీజ్ చేసేటట్టు అయితే కొన్ని గంటల పాటు దీన్ని ఫ్రిజ్ లోనే ఉంచాలి. ఇది పెరుగు పుల్లగా కాకుండా చేస్తుంది.  అలాగే పెరుగును లోహ పాత్రల్లో కాకుండా మట్టి కుండల్లో నిల్వ చేయాలి. అప్పుడే పెరుగు త్వరగా పుల్లగా కాదు. చెడిపోదు. 

పెరుగును రిఫ్రిజిరేటర్ లో పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది వెచ్చని ప్రదేశంలో ఉంచితే త్వరగా పులియబెట్టబడుతుంది. పుల్లగా అవుతుంది. దీనివల్ల పెరుగు త్వరగా పాడైపోతుంది కూడా. ఘనీభవించిన పెరుగును రాత్రంతా వడకట్టడం వల్ల దాని ఆమ్లత్వం తగ్గుతుంది. దీంతో పుల్లని రుచి చాలా వరకు తగ్గుతుంది. పెరుగు చిక్కగా ఉంటుంది. 

click me!