అరటి పండుతో ఇవి తింటున్నారా ఎంత ప్రమాదమో తెలుసా?

First Published | Jun 15, 2024, 1:49 PM IST

రాంగ్ కాంబినేషన్ లో అరటి పండు తినడం వల్ల... ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుందట. అందుకే.. అరటి పండుతో ఎలాంటి ఫుడ్స్  తీసుకోకూడదో తెలుసుకోవాలి. 

అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. అందుకే అరటిపండ్లను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.

అరటి ఆరోగ్య ప్రయోజనాలు

అరటిపండు పొటాషియం, ఫైబర్ మరియు విటమిన్ B6 అద్భుతమైన మూలం. అంతే కాకుండా అరటిపండు తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్స్ అందడంతో పాటు శరీరం చురుగ్గా ఉంటుంది. కానీ అరటిపండ్లను సరైన పద్ధతిలో , సరైన పదార్థాలతో తింటేనే ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. రాంగ్ కాంబినేషన్ లో అరటి పండు తినడం వల్ల... ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుందట. అందుకే.. అరటి పండుతో ఎలాంటి ఫుడ్స్  తీసుకోకూడదో తెలుసుకోవాలి. 
 

Latest Videos



అరటి, పాలు

చాలా మంది అల్పాహారంలో పాలు, అరటిపండును ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి తింటే కడుపు నిండుతుంది, త్వరగా ఆకలి వేయదు. అయితే అరటిపండ్లను ఎప్పుడూ పాలతో కలిపి తినకూడదని మీకు తెలుసా? ఎందుకంటే ఇది కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
 


అరటి పండుతో సిట్రస్ ఫ్రూట్స్..

ద్రాక్ష, నారింజ, నిమ్మ వంటి పుల్లని పండ్లతో అరటిపండ్లను ఎప్పుడూ తినకూడదు. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
 

అరటిపండుతో తేనె..

అరటిపండును ఎప్పుడూ తేనెతో కలపకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని సృష్టించి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
 

అరటిపండుతో పెరుగు..

చాలా మంది అరటిపండును పెరుగుతో తినడానికి ఇష్టపడతారు. మీరు అలాంటి వారిలో ఒకరైతే, ఈ అలవాటును ఈరోజే మానేయండి. ఎందుకంటే, ఇది ఉబ్బరం , జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా దగ్గు పెరగవచ్చు.

click me!