నెల రోజులపాటు రోజూ ఒక అరటిపండు తింటే ఏమౌతుందో తెలుసా?

Published : Dec 30, 2024, 05:10 PM IST

అరటిపండ్ల ఖరీదు తక్కువే అయినా.. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం అంతా ఇంతా కాదు. మీరు గనుక ఒక నెలరోజుల పాటు రోజూ ఒక అరటిపండును తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

PREV
16
నెల రోజులపాటు రోజూ ఒక అరటిపండు తింటే ఏమౌతుందో తెలుసా?

మన శరీరం హెల్తీగా ఉండాలంటే సమతుల్య  ఆహారాన్నిఖచ్చితంగా తినాలి. ఎందుకంటే దీనిలో మన శరీరాన్ని హెల్తీగా ఉంచే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇలాంటి వాటిలో అరటిపండు ఒకటి. అరటిపండులో బిటమిన్ బి6, పొటాషియం, ఫైబర్ వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందుకే ఈ పండును ఖచ్చితంగా రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ అరటిపండును తింటే మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ముఖ్యంగా మీరు ఒక నెలరోజుల పాటు రోజూ ఒక అరటిపండును తింటే ఎన్నో ఆశ్చర్యపోయే ప్రయోజనాలను చూస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

26
banana

నెలరోజులు అరటిపండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుండెకు మేలు చేస్తుంది

అరటి పండులో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అరటిపండును తింటే ఇది హృదయ స్పందన నియంత్రణలో ఉంటుంది. అలాగే అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది. మీరు గనుక రోజూ ఒక అరటిపండును తింటే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన గుండెకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తప్పించుకుంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

36
banana

ఆరోగ్యకరమైన జీర్ణక్రియ

అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను  ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. రోజూ అరటిపండును తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. అలాగే కడుపునకు సంబంధించిన సమస్యలు, ఇతర సమస్యల నుంచి కూడా బయటపడతారు. అరటిపండును తింటే గట్  ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

తక్షణ శక్తి వస్తుంది

అరటిపండ్లలో నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మీరు వ్యాయామం చేసిన తర్వాత లేదా పని బాగా చేసిన తర్వాత అరటిపండును తింటే అలసట తగ్గిపోతుంది. అలాగే శరీరంలో మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నీరసం అనే సమస్యే ఉండదు. 

46

మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది

అరటిపండును తింటే మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి,విటమిన్ బి 6 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన మెదడు పనితీరును మెరుగుపర్చడానికి బాగా సహాయపడతాయి. అరటిపండులో ఉండే పోషకాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. 
 

56

చర్మం కాంతివంతంగా మారుతుంది

అరటి పండ్లు మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. అరటిపండులో ఉండే పోషకాలన్నీ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.

ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం

అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం  పుష్కలంగా ఉంటుంది. ఇది సెరోటోనిన్ గా మారి మన మానసిక స్థితిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఈ న్యూరోట్రాన్స్మిటర్ మన మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే అందుకే అరటి పండ్లను రోజూ తింటే ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. 
 

66

బలమైన ఎముకల

అరటిపండ్లను తింటే మన ఎముకలు బలంగా ఉంటాయి. ఎందుకంటే అరటిపండ్లలో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఎముకల్ని బలంగా చేయడానికి సహాయపడతాయి. అరటిలో ఉండే ఈ పోషకాలు బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories