దీపావళి రోజు మనం ఇంట్లో రకరకాల పిండి వంటలు చేస్తుంటాం. ముఖ్యంగా స్వీట్స్. అయితే పండుగ నాడు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా, తక్కువ టైంలో చేసుకోగలిగే స్వీట్ ఒకటి ఉంది. అదే బాదుషా. ఈ స్వీట్ ని వంటలు రానివారు కూడా ఈజీగా చేసేయవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
స్వీట్లల్లో బాదుషాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ స్వీట్‌ను మనం ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. వంట అంతగా రానివారు కూడా ఈ స్వీట్ ని ఈజీగా ప్రిపేర్ చేసేయవచ్చు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో టేస్టీ బాదుషాను మనకు నచ్చిన సైజులో చేసుకొని తినవచ్చు. మరి ఆలస్యమెందుకు.. ఈ దీపావళికి ఈ సింపుల్ స్వీట్ తో మీ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చుకోండి. బాదుషా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉంది. చూసి ట్రై చేయండి.
26
కావాల్సిన పదార్థాలు
బాదుషా తయారీకి ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకోవాలి. ¼ కప్పు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల పాలు, ¼ టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు, సరిపడా వాటర్, డీప్ ఫ్రైకి అవసరమైనంత నూనె, ఒక కప్పు చక్కెర, కొంచెం యాలకుల పొడి, కొంచెం పిస్తా (మీకు ఇష్టమైతే) తీసుకోవాలి.
36
బాదుషా తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో మైదా, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో నెయ్యి, పాలు వేసి బాగా కలిపి, కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా కలుపుకోవాలి. ఆ పిండిని 15-20 నిమిషాల వరకు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని, వాటిని వెడల్పుగా ఒత్తుకోవాలి. బాదుషా షేప్ రావడానికి మధ్యలో చిన్నగా నొక్కాలి.
తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను తీసుకొని మీడియం ఫ్లేమ్ పై వేడి చేయాలి. నూనె వేడయ్యాక మనం ఆల్రెడి చేసి పెట్టుకున్న చిన్న చిన్న బాదుషాలను నూనెలో వేసి లో ఫ్లేమ్ పై వేయించాలి. రెండు వైపుల మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. నూనె లేకుండా తీసి వాటిని పక్కన పెట్టుకోవాలి.
56
చక్కెర పాకం తయారీ
ఒక పాన్ లో ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నీరు వేసి.. లో ఫ్లేమ్ పై మరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగి.. పాకం మంచిగా వచ్చేదాక వేడిచేయాలి. అందులో కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
66
బాదుషా రెడీ
తర్వాత వేయించిన బాదుషాలను చక్కెర పాకంలో వేసి కాసేపు పక్కన పెడితే చాలు. మనం కోరుకున్న టేస్టీ బాదుషాలు రెడీ అయిపోయినట్లే. వాటిపై చిన్న చిన్న పిస్తా ముక్కలు చల్లుకొని తింటే చాలా బాగుంటుంది.