Mutton Buying Tips: లేత మటన్ vs ముదురు మటన్.. ముక్కను చూడగానే కనిపెట్టేయండిలా !

Published : Jun 26, 2026, 09:16 AM IST

Mutton Buying Tips: మార్కెట్‌కు వెళ్లినప్పుడు లేత మటన్‌కు, ముదురు మటన్‌కు మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలుసా? ముదురు మటన్ తింటూ ఇబ్బంది పడుతున్నారా? కొనేటప్పుడే లేత మటన్‌ను సులభంగా గుర్తించే అద్భుతమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
మటన్ లవర్స్ అలర్ట్: లేత మటన్ కు, ముదురు ముక్కకు తేడా ఇదే.. కొనేటప్పుడు ఇది చూసుకోండి

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులకు పండగే. అందులోనూ మటన్ ముక్క పడితే ఆ మజానే వేరు. అయితే, కొన్నిసార్లు మనం తెచ్చిన మటన్ ఎంత ఉడికించినా ఉడకదు. రబ్బరు ముక్కలా సాగుతూ, నమలలేక నోరు నొప్పులు పుడుతుంది. దీనికంతటికీ కారణం అది ముదురు మటన్ కావడమే.

మరి మార్కెట్‌కు వెళ్లినప్పుడు లేత మటన్‌కు, ముదురు మటన్‌కు మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలుసా? వండేటప్పుడు మాత్రమే కాదు, మాంసం దుకాణంలో ఉన్నప్పుడే పచ్చి మాంసాన్ని చూసి అది లేతదా లేక ముదురుదా అని చాలా ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

26
మటన్ రంగును బట్టి కనిపెట్టేయండి

మటన్ కొనేటప్పుడు మనం గమనించాల్సిన మొదటి విషయం దాని రంగు. లేత మటన్ ఎల్లప్పుడూ లేత గులాబీ రంగులో లేదా సాఫ్ట్ రెడ్ కలర్‌లో మెరుస్తూ, ఎంతో తాజాగా కనిపిస్తుంది. అదే ముదురు మటన్ అంటే వయసు పైబడిన మేక లేదా గొర్రె మాంసం అయితే, ముదురు ఎరుపు లేదా ఒక రకమైన పర్పుల్ రంగులో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మాంసం రంగు మరింత ముదురు రంగులోకి మారుతుంది.

36
కొవ్వు, మాంసం ఆకృతి చెక్ చేయండి

మాంసానికి ఉండే కొవ్వు ఆధారంగా కూడా దీన్ని గుర్తించవచ్చు. లేత మాంసంలో కొవ్వు క్రీమ్ వైట్ కలర్‌లో, చాలా మెత్తగా ఉండి ముక్కల మధ్య సమానంగా విస్తరించి ఉంటుంది. అదే ముదురు మాంసంలో కొవ్వు కాస్త పసుపు రంగులోకి మారి, మందంగా, గట్టిగా ఉంటుంది.

ఇక మాంసం టెక్స్చర్ విషయానికి వస్తే.. లేత మటన్ పీచు చాలా స్మూత్‌గా, చిన్న చిన్న కండరాల పోగులతో దగ్గరగా ఉంటుంది. ముదురు మటన్ పీచు చాలా లావుగా, తాడు ముక్కల్లా విడివిడిగా స్పష్టంగా కనిపిస్తుంది.

46
ఎముకల నిర్మాణం ఎలా ఉందో చూడండి

దుకాణంలో ముక్కలు కొట్టేటప్పుడు ఎముకలను కాస్త జాగ్రత్తగా గమనించండి. లేత మటన్ ఎముకలు చిన్నవిగా ఉంటాయి. వాటి జాయింట్ల దగ్గర కాస్త ఎరుపు, గులాబీ రంగు మిశ్రమంలో రంధ్రాలు ఉన్నట్లు కనిపిస్తాయి. అదే ముదురు జీవాల ఎముకలు చాలా లావుగా ఉంటాయి. అవి చాక్ వైట్ రంగులో ఉండి, గట్టిగా, త్వరగా విరిగిపోయేలా కనిపిస్తాయి.

56
వండిన తర్వాత తేడాలు

ఒకవేళ మటన్ ఆల్రెడీ మీ ప్లేట్ లోకి వచ్చేస్తే.. అది లేతదా, ముదురుదా అనేది మీ పళ్లకు వెంటనే తెలిసిపోతుంది. లేత మటన్ ముక్కను స్పూన్‌తో లేదా ఫోర్క్‌తో తుంచితే ఈజీగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే జ్యూసీగా కరిగిపోతుంది. ఇది చాలా త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఫ్రై, గ్రిల్ లేదా నార్మల్ కర్రీస్‌కు బెస్ట్.

కానీ ముదురు మటన్ రబ్బరులా, పీచు పీచుగా ఉంటుంది. ఎంత నమిలినా నోట్లోనే ఉంటుంది. గ్రేవీలో ఎంత ఉడికించినా ముక్క మాత్రం డ్రైగా, గట్టిగా చెక్కలా అనిపిస్తుంది. ఇది ఉడకడానికి చాలా సమయం పడుతుంది.

66
గట్టి మాంసాన్ని మెత్తగా మార్చే ప్రో టిప్స్ మీకోసం

మటన్‌లో రిబ్స్, చాప్స్, లోయిన్ వంటి భాగాలు సహజంగానే లేతగా ఉంటాయి. ఎందుకంటే ఆ కండరాలు ఎక్కువ కదలవు. అదే షాంక్స్, షోల్డర్, లెగ్స్ వంటి భాగాలు గట్టిగా ఉంటాయి. ఒకవేళ మీరు పొరపాటున ముదురు మటన్ తెచ్చినా టెన్షన్ పడక్కర్లేదు.

దాన్ని తక్కువ మంట మీద ఎక్కువ సేపు లేదా కుక్కర్‌లో ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. దీనివల్ల అందులోని కొల్లాజెన్ కరిగి మాంసం మెత్తగా మారుతుంది. అలాగే వండడానికి కొన్ని గంటల ముందు పచ్చి బొప్పాయి పేస్ట్, పెరుగు లేదా నిమ్మరసంతో మ్యాగ్‌నెట్ చేస్తే.. ఆ గట్టి పీచులు త్వరగా విడిపోయి మటన్ సాఫ్ట్‌గా మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories