పిండి కలిపే పద్దతి...
చపాతీ పిండిని కలిపేటప్పుడు అందరూ నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. కానీ, నీటిని వాడి చపాతీ పిండి కలిపి.. చపాతీ చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే గట్టిగా మారిపోతాయి. అలా కాకుండా... పిండిలో చీజ్ కలపాలి. చీజ్ అంటే మార్కెట్లో దొరికే చీజ్ కాకుండా... నిమ్మరసం వాడి పాలను విరగ్గొట్టి... దానిని పిండిలో వేసి కలపాలి. ఇలా కలిపిన పిండితో చేసిన రోటీలు.. మృదువుగా, దూదిలాగా వస్తాయి.
లేదంటే.. గోధుమ పిండిలో పుల్లటి పెరుగు, వేడి నీళ్లు వేసి పిండి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా రోటీలు మెత్తగా వస్తాయి. ఉదయం చేసినా మధ్యాహ్నం వరకు కూడా చాలా మృదువుగా వస్తాయి. ఎందుకంటే.. పెరుగులో ఉండే సహజ ఆమ్లాలు, పిండిలోని గ్లూటెన్ ను మెత్తగా మారుస్తాయి.