బాదం పప్పులను తినే అలవాటుందా? రోజుకు ఇన్ని మాత్రమే తినండి.. లేదంటే సమస్యలొచ్చేస్తయ్..

First Published | Jan 30, 2024, 10:31 AM IST

చలికాలంలో బాదం పప్పులను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నానబెట్టిన బాదం పప్పులను ప్రతి ఒక్కరూ తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. బాదం ఆరోగ్యానికి మంచివే కానీ.. వీటిని మోతాదుకు మించి తింటే సమస్యలొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

నానబెట్టిన బాదం పప్పులను తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. చాలా మంది బాదం లేదా జీడిపప్పును వేయించి లేదా పచ్చిగా తింటుంటారు. కానీ చాలా మంది నిపుణులు నానబెట్టిన బాదం పప్పులనే తినాలని, ఇవే ఆరోగ్యానికి మంచివని చెప్తుంటారు. బాదం పప్పుల్లో ఫైబర్, విటమిన్ ఇ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. 
 

అయితే బాదం పప్పుల ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే మాత్రం వీటిని ఎలా తినాలి? ఎంత తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బాదం పప్పులను ఎక్కువగా తినడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. అందుకే రోజుకు ఎన్ని బాదం పప్పులను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి?

మీరు బాదం పప్పులను తినడం స్టార్ట్ చేస్తే.. ముందుగా 2 నానబెట్టిన బాదంతో ప్రారంభించండి.
ఇందుకోసం 2 బాదం పప్పులను  తీసుకుని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటి తొక్క తీసేసి తినండి. 
మీరు రోజుకు 2 బాదం పప్పులు తిన్నప్పుడే మీ శరీరం వాటిని సరిగ్గా జీర్ణం చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఒక వారం లేదా 10 రోజుల తర్వాత 5 బాదం పప్పులను తినడం ప్రారంభించండి.
ఒకవేళ మీకు ఉబ్బరం లేదా అజీర్ణం వంటి సమస్యలు వచ్చినట్టు అనిపిస్తే బాదం పప్పుల కౌంట్ ను పెంచకండి. 

క్రమంగా బాదం పప్పుల సంఖ్యను పెంచుకుంటూ మీరు  రోజూ 10 బాదం పప్పుల వరకు తినొచ్చని నిపునులు చెబుతున్నారు. 
90 రోజుల పాటు రోజూ 10 బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
జీర్ణక్రియ బాగున్నవారు రోజూ వ్యాయామం చేసి, సరైన మోతాదులో నీరు తాగితే రోజుకు 20 బాదం పప్పులు కూడా తినొచ్చు.
బాదం, ఇతర గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్ కు మంచి మూలం. కానీ వీటిని జీర్ణించుకోవడం కష్టం.
 

almonds

రోజూ 10 బాదం పప్పులు తినడం మంచిదేనా?

బాదం పప్పుల్లో విటమిన్ ఇ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, విటమిన్-బి2 అంటే రిబోఫ్లేవిన్ లు మెండుగా ఉంటాయి.
వీటిలో ఐరన్, పొటాషియం, జింక్, ఫోలేట్, విటమిన్ బి లు కూడా ఉంటాయి.
ఈ పప్పులు మీకు బలాన్ని ఇస్తాయి. అలాగే పీరియడ్స్ తిమ్మిరిని తగ్గిస్తాయి. 

జీర్ణక్రియకు, మెదడు ఆరోగ్యానికి కూడా బాదం ఎంతో మేలు చేస్తుంది.
బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
బీపీ, కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి.
 

Latest Videos

click me!