అసలు స్వీట్లను ఎందుకు తింటారో తెలుసా?

First Published Jan 29, 2024, 1:19 PM IST

చాలా మందికి స్వీట్లంటే చాలా ఇష్టం. తియ్య తియ్యగా రోజూ తినాలని కోరుకుంటారు. కానీ స్వీట్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఇవి మీ బరువును పెంచడంతో పాటుగా మీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతాయి. మరెన్నో రోగాలొచ్చేలా చేస్తాయి. అయితే రోజూ స్వీట్లను తినాలనిపించడానికి కూడా కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం పదండి.
 

మన మందరం ఏదో ఒక సమయంలో స్వీట్లను తినాలనుకుంటాం. కానీ కొంతమంది అయితే ప్రతి రోజూ తీపిని తింటుంటారు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత ఏదో ఒక రకమైన స్వీట్ ను ఖచ్చితంగా తింటుంటారు. మనలో చాలా మందికి తీయ్యని ఆహారాలంటే చాలా ఇష్టం. వీళ్లే రోజూ స్వీట్ ను తినాలనుకుంటారు. దీన్నే షుగర్ ఫుడ్ కోరికలు అంటారు.
 

నిజానికి తీపిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇది మీ బరువును పెంచడమే కాకుండా.. అధిక రక్తపోటు నుంచి డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు లేదా నోటి సమస్యలకు దారితీస్తుంది. అసలు మీకు తీపిని తినాలన్న కోరికలు ఎందుకు కలుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల ప్రకారం.. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
 

తక్కువ ప్రోటీన్ తీసుకోవడం

మన శరీరానికి ప్రోటీన్ చాలా చాలా అవసరం. ఇది మీకు సంతృప్తిని కలిగిస్తుంది. అంతేకాదు ఇన్సులిన్, రక్తంలో చక్కెర నియంత్రణకు కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మీరు ప్రోటీన్ తీసుకోవడం తగ్గించినప్పుడు ఇది రక్తంలో చక్కెరను దెబ్బతీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఇది మీ ఆకలి హార్మోన్, లెప్టిన్, గ్రెలిన్ ను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా మీకు తీపి కోరికలు కలుగుతాయి. 
 

తక్కువ ఫైబర్ తీసుకోవడం

ప్రోటీన్ మాదిరిగానే ఫైబర్ ను తక్కువగా తీసుకోవడం వల్ల కూడా షుగర్ కోరికలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఫైబర్ కూడా రక్తంలో చక్కెర నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలలో ఫైబర్ కారణంగా.. రక్తప్రవాహంలో చక్కెర శోషణ నెమ్మదిగా ఉంటుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ పెరిగే సమస్య ఉండదు. దీని వల్ల మీకు చక్కెర కోరికలు ఎక్కువగా ఉండవు. స్వీట్ కోరికలు కలగొద్దంటే మీ రోజువారి ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చండి. 
 

హార్మోన్ల హెచ్చుతగ్గులు

ఆకలి హార్మోన్లతో పాటుగా ఒత్తిడి హార్మోన్లు కూడా మీలో చక్కెర కోరికలను పెండానికి కారణమవుతాయి. నిజానికి మీరు ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరం కార్టిసాల్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది గ్రెలిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో మీ ఆకలి పెరుగుతుంది. ఇలాంటప్పుడు స్వీట్లు తినాలనే కోరిక పెరుగుతుంది. అందుకే ఒత్తిడికి గురైనప్పుడు చాక్లెట్ లేదా పేస్ట్రీలను తింటుంటారు. అలాగే పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలలో మార్పులు వస్తాయి. దీనివల్ల కూడా స్వీట్ ను తినాలనిపిస్తుంది. 
 

సరిగా నిద్ర పట్టకపోవడం

చాలామంది పనిలో పడి సరిగ్గా నిద్రపోవడం లేదు. కానీ నిద్ర లేకపోవడం వల్ల కూడా చక్కెర కోరికలు పెరుగుతాయి. నిజానికి మీరు సరిగ్గా నిద్రపోకపోతే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఇది గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా మీకు తీపిని తినాలనే కోరిక కలుగుతుంది. 
 

నిర్జలీకరణం

నీళ్లు తక్కువగా తాగితే.. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో దాహం తక్కువగా అనిపించినప్పుడు మన శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. కానీ దాహాన్ని మన శరీరం ఆకలిగా అర్థం చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీకు తీపి స్నాక్స్, చక్కెర పానీయాలపై కోరిక కలుగుతుంది. 
 

click me!