ఎండాకాలంలో లభించే లిచీ పండ్లు ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతేకాదు ఈ పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ జ్యూసీ పండులోని గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు
లిచీ విత్తనాల్లో బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అలాగే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ప్రోయాంతోసైనిడిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే క్యాన్సర్, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
చర్మ ఆరోగ్యం
లిచీలు జుట్టుకు మంచివని తెలుసు. కానీ లీచీ విత్తనాలు మన చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. లీచీ విత్తన సారాలు చర్మ ఆరోగ్యం ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఈ సారాలలో ఎక్కువ మొత్తంలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను కాపాడుతాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అలాగే చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. ఈ విత్తనాల సారంలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడానికి, రంగును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. లీచీ గింజలు మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
గుండె ఆరోగ్యం
లిచీ విత్తన సారాలు గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ సారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి, మంటను తగ్గించడానికి, రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయని కనుగొనబడింది. లీచీ విత్తనాల సారాలను చేర్చడం ద్వారా మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
యాంటీ డయాబెటిక్ సామర్థ్యం
కొన్ని అధ్యయనాలు లిచీ విత్తన సారాలు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయని వెల్లడిస్తున్నాయి. ఈ సారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. డయాబెటిస్ తో సంబంధం ఉన్న సమస్యలను కూడా తగ్గిస్తాయి. డయాబెటిస్ తో ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారికి లిచీ విత్తనాల సారాలను వారి ఆహారంలో చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా వీటిని మితంగానే తినాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.