జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఇవి..

Published : Jan 28, 2024, 05:07 PM IST

పిల్లలకైనా, పెద్దలకైనా మెమోరీ పవర్  బాగుండాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు రావు. అయితే మనలో కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని ఆహారాలను తింటే మర్చిపోయాం అన్న ముచ్చటే ఉండదు. అవును కొన్ని ఆహారాలను తింటే మన మెమోరీ పవర్ బాగా పెరుగుతుంది. అవేంటంటే?   

PREV
16
జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఇవి..
brain health

మన మెదడు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటేనే  మనం హెల్తీగా ఉంటాం. అయితే మనలో కొంతమందికి  ఇప్పుడే చెప్పిన విషయాలు కూడా గుర్తుండవు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలు మన మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే అభిజ్ఞా అభివృద్ధి చెందుతుంది. ఇవి మన జ్ఞాపకశక్తిని బాగా పెంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
Blueberries

బ్లూబెర్రీలు

బ్లూబెర్రీలల్లో ఫ్లేవనాయిడ్లు అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీలను ను క్రమం తప్పకుండా తినడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.
 

36

చేపలు

సాల్మన్, ట్రౌట్,సార్డినెస్ వంటి కొవ్వు చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప వనరులు. ముఖ్యంగా డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం మెండుగా ఉంటుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. కొవ్వు చేపలను ఆహారంలో చేర్చడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతాయి.
 

46

బ్రోకలీ

బ్రొకోలీ మన శరీరానికే కాదు మెదడుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె ఎక్కువగా ఉండే బ్రోకలీ మెదడు ఆరోగ్యకరమైన పనితీరుకు మద్దతునిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

56

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్లు, కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి, అభిజ్ఞా అభివృద్ధిని మెరుగుపరచడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
 

66

పసుపు

పసుపులోని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్. దీనిలో బలమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కర్కుమిన్ తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పసుపును ఆహారంలో చేర్చడం వల్ల జ్ఞాపకశక్తి, మెదడు ఆరోగ్యం బాగుంటుంది. పసుపు మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories